"కూ...... తుక్ తుక్ త్వైను..." సిరి కేరింతలు నా ఆలోచనలని చెదరగొట్టాయి.
లక్కరంగు ట్రైన్ బొమ్మని నేలమీద పాకిస్తూ దాని వెంట తనూ గుండ్రంగా పాకుతోంది. ఆ తేనెరంగు మొహంలో ఉబికివచ్చే సంతోషం నా మనసులోకి ప్రశాంతంగా పంపిణీ అయ్యేది ఎప్పుడూ. వారంలో ఎంతమార్పు!
"పరమేశ్వర్ గారు.." ఫోన్ తెచ్చి నా చేతికిస్తూ చెప్పింది వినత.
"ఏవయ్యా భయపడ్డావా? అపాయింట్మెంట్ కేన్సిల్ చేయించావట?" అట్నుంచి పరమేశ్వర్ గొంతు ఖణీమని మోగింది.
నీట్ గా ఫైల్ చేసి ఉన్న గోళ్ళతో అతిశుభ్రంగా తళతళలాడే నా పాదాలని పొద్దస్తమానం షూస్ లో బంధించి ఉంచేవాడిని. పరిచయమైన కొత్తలో గుడికెళ్దామని వినత అడిగిన మూడోసారి.. ఇక తప్పక బయట షూస్ విప్పినప్పుడు నా కాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూసి నవ్వింది.. "ఇందుకా షూస్ విప్పనిదీ..!" అన్నట్టు. నా కాలి బొటన వేలికీ దాని పక్కవేలికీ ఇన్నర్ స్పేస్ చాలా ఎక్కువ.. మరో వేలు పట్టేంత ఖాళీ.
"ఇది దాచలేదుగా పోనీ.." ముందు పళ్ళకి మధ్య ఉన్న ఖాళీలో టేబుల్ మీదున్న పేపర్ క్లిప్ అడ్డంగా ఇరికించుకుని గమ్మత్తు చేసాను.
***
"ఉహూ.. బజ్జో.." అటు తిరిగి చెప్పింది.
నా వైపు పూర్తిగా తిరిగి బెడ్ లేంప్ వెలుగులో నన్ను చూస్తూ అడిగింది వినత.
***
"చిలకలా ఉందిరా.. అచ్చం నానమ్మ పోలికే!!" సిరిని ఒళ్ళో కూర్చోబెడితే ఆమ్మ కళ్ళలో సంబరం.
సిరి మొహంలోకి నవ్వుతూ చూస్తున్నదల్లా చటుక్కున తలెత్తి చూసింది నావైపు. వినతనూ నన్నూ మార్చి మార్చి చూసింది.
"నేనేమీ భయపడలేదండత్తయ్య గారూ.. ఈయనే ఓ.. హడావిడి చేసేసారు. అందులోనూ వాళ్ళమ్మ పోయిన ఏడాదిలోగా పుట్టింది కదా.. ఆవిడే మళ్ళీ వచ్చారని అపురూపం! డాక్టర్లూ చెప్పారు.. మాటల్రాకపోవూ.. కొందరికి ఆలస్యమవుతాయంతే అని. వినరే..." సిరిని ఆమ్మ ఒళ్ళోంచి తీసుకుంటూ చెప్పింది వినత.
***
ఆ సాయంత్రం మేం బయలుదేరుతామనగా దగ్గరికి పిలిచింది ఆమ్మ. "ఓ ఐదు నిముషాలు కూర్చోరా చక్రీ.." అని. అన్నదమ్ముల పిల్లలైనా, వయసులో సహస్రాంతం తేడా ఉన్నా.. అమ్మా, ఆమ్మా ఏకప్రాణంగా పెరిగారు. ఆమ్మ కొడుకులిద్దరూ విదేశాల్లో సెటిలైపోయాక తనూ వెళ్ళిపోయింది. అమ్మ పోయినప్పుడు కబురంపితే ఆఘమేఘాలమీద వచ్చి వాలుతుందనుకున్నాను. "అదృష్టవంతురాలు..." అని ఫోన్ పెట్టేసింది. ప్రేమ ఎక్కువున్నా అంతేనేమో అనిపించింది. అమ్మపోయిన మూడేళ్ళు దాటాక ఇదే ఇటువైపు రావడం. తన మరిదిగారింట్లో దిగుతూనే కబురంపింది.
"పెద్దదాన్నైపోతున్నానురా చక్రీ.."
"......"
"ఏమీ సోకు తక్కువయ్యిందా!" ఆమ్మ కళ్ళలో నిష్టూరం.
నా చేతిమీద చేత్తో రాస్తూ చాలా సేపు అలా ఉండిపోయింది. వినత గభాలున గదిలోకి వచ్చినదే... మమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళిపోయింది.
"మీ ఆవిడ విలక్షణంగా ఉందిరా.. కలుపుగోలు పిల్ల. నేను మళ్ళీ ఈ దేశం వస్తానో.. రాగలనో.. లేనో.. ఒంట్లో ఏం సుఖంగా లేదు. ఎప్పుడో దేశం కాని దేశంలోనే ఎగిరిపోతుందీ ప్రాణం." ఏదేదో మాట్లాడుతోంది.
నాకు అర్ధం కాలేదు. చాలాసేపు అర్ధం కాలేదు. అర్ధమవడం మొదలుపెట్టాక.. నాకు వినబడుతున్న ఒక్కోమాటా నా మెదడుని చిత్రవధ చేసిమరీ లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసింది.
"నూటేభై ఎకరాల ఆసామీ మీ తాత. ఏనాడ ఊరంతా మీ తాతదే! వేద ఒక్కగానొక్క కూతురు. మేనరికం చేసి తన చెల్లెలి కొడుకు చలపతిని ఇల్లరికం తెచ్చుకుందామనుకున్నాడు. మీ అమ్మకి ఇష్టం లేకపోయింది. మీ అమ్మమ్మ అన్నకొడుకు... నరహరి.. అంటే మీ అమ్మకి బావే.. కాపోతే మావ కొడుకు బావ.. వాడిని ప్రేమించింది. ఏడ్చింది. పోరాడింది. కానీ డబ్బు గెలిచిందిరా చక్రీ... విడదీసేసారిద్దర్నీ. చలపాయ్ నే కట్టుకోవలసి వచ్చింది. పెళ్ళిక్కూడా ఎవర్నీ పిలవలేదు. అంత గొప్ప ఏనాడ జమీందారు కూతురి పెళ్ళీ రాత్రికి రాత్రీ జరిగిపోయింది. ఏవిటా అన్నవాళ్ళకి మూలనున్న ముసలమ్మ.. మీ తాతమ్మని వంక చూపించారు. అంతే.. మూడు ముళ్ళూ పడ్డ క్షణం నుంచీ మీ అమ్మ ఇక మాట్లాడలేదు."
అయోమయంగా చూస్తూ కూర్చుండిపోయాను. వినత వచ్చి 'రైలుకి టైమైపోతోందండీ..' అని ఆమ్మతో చెప్పడం. 'వస్తాడ్లే..' అని తనని పంపేయడం లీలగా తెలుస్తోంది.
మర్నాడుదయం బయలుదేరుతూంటే అడిగింది ఆమ్మ..
***
"నిజమా!!" నోరు తెరుచుకుని ఉండిపోయింది వినత. సోఫాలో కూలబడ్డ నన్ను అయోమయంగా చూస్తూ కూర్చుంది.
"...."
"చక్రీ నేనూ ప్రేమించుకున్నామండీ.. మా ఇంట్లో ఒప్పుకోలేదు. నాకు వేరే పెళ్ళి చేసేస్తామంటున్నారు." అమ్మవారి గుళ్ళో అమ్మ ఎదురుగా తలవంచుకు చెప్పిన వినతనీ, నన్నూ చెరో చేత్తోనూ పట్టుకుని.. ఇంటికి తీసుకొచ్చేసింది అమ్మ. ఇదేవిటన్న నాన్నని ఒకే ఒక్క చూపుతో నిలవరించింది. కోడలు అడుగుపెట్టిన నెలలో మావగారిని మింగేసిందని చాటున గుసగుసలాడిన పనిమనిషిని సైతం మళ్ళీ గడపలోపలికి రానివ్వలేదు.
"ఏమో చక్రీ.. ఆమెలో మూర్ఖత్వం పాళ్ళెంతో నాకు తెలీదు. ఒక్క విషయం మాత్రం తెలుసు.. ప్రేమించినవాడికోసం ఆడపిల్ల ఎంతకి తెగించగలదో బాగా తెలుసు. పిల్లలు పుడితే పాతప్రేమలు చెరిగిపోతాయా, పోవా అంటే మాత్రం నేను చెప్పలేను. నాకా అవసరం రానివ్వలేదామె.." ఖాళీ పాలసీసాని నేలకేసి కొడుతున్న సిరి వైపు చూస్తూ చెప్పింది.
"ఇప్పుడా ఊరు వెళ్ళాలట.. అతగాడిని చూడ్డానికి ఈ ఆమ్మగారు వెళ్తూంటే సాయం... నాన్సెన్స్.." విసురుగా లేచి బయటికి నడిచాను.
ఆ వారం రోజులూ నిజాన్ని పూటపూటకీ కొద్దికొద్దిగా ఇంకేలా చేసాయి.
***
మరో నిద్రలేని రాత్రి తెల్లారింది. ఆమ్మ వచ్చింది.
***
నల్లగా రివటలా ఉన్నాడతను. నేనూహించినట్టే పెళ్ళి చేసుకోలేదట. హుషారుగా ఉన్నాడు. తెల్ల అడ్డ పంచె, తెల్ల చొక్కాలో పూలరంగడిలా ఉన్నాడు. ఇంటిముందు బోలెడు మొక్కలు.. ఉన్న కాస్త పొలం కౌలుకిచ్చి వచ్చినదాంతో హాయిగా బతికేస్తున్నాడు. చీకూ చింతా.. పెళ్ళీ పెళ్ళామూ.. ఏమీ లేని సన్నాసి జీవితం కదూ మరీ! వంటింట్లోంచి కాఫీ గ్లాసులు ట్రే లో పెట్టి తెస్తున్న అతనికి ఎదురెళ్ళింది వినత. నాకు నచ్చలేదు.
"ఉంటానయ్యా నరహరీ.. మళ్ళీ రాగలనో లేనో.." కారెక్కుతూ చెప్పింది ఆమ్మ.
విసుగ్గా డ్రైవింగ్ సీట్లో కూలబడ్డాను. వెనక ఆమ్మ వినతతో ఏవేవో చెప్తోంది.
"అయ్యో.. డైపర్ బేగ్ మర్చిపోయాను చక్రీ..." వీధి మలుపు తిరుగుతూండగా అరిచింది వినత.
విధిలేక వెనక్కి వెళ్ళిన నాకు పంచె ఎగ్గట్టి పరిగెత్తుకొస్తూ అతనెదురయ్యాడు. కళ్ళలోకి చూడకుండా బేగ్ అందుకుని వెనక్కి తిరగబోతూండగా... క్షణంలో సగం సేపు అతని కాళ్ళ మీద పడింది దృష్టి.. నా కళ్ళు బైర్లు కమ్మాయి.
అతని కాలివేళ్ళ మధ్య ఖాళీ... మరో వేలు పట్టేంత...
ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మౡ మీ కధ చదివే భాగ్యం....:)
ReplyDeleteముగింపు వూహించినట్టుగానే వున్నా మీ కథనం మాత్రం ఎప్పటిలాగే చాలా క్రిస్ప్ గా వుంది.
ధన్యవాదాలు! :)
DeleteNice and different.....routine ki binnam ga vundi....really nice
ReplyDeleteధన్యవాదాలు!
DeleteLiked it very much. Especially the narration and dialogues.
ReplyDeleteSJ
bagundi katha
ReplyDeleteధన్యవాదాలు!
Deleteమాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్...
ReplyDeleteఆ తర్వాత చక్రీ పరిస్థితేంటండీ? సీక్వెల్ ఉందా?
సీక్వెల్ లు హిట్ అవడం అరుదని మీకు నేను చెప్పాలేంటండీ రాజ్ కుమార్ గారూ! :) ధన్యవాదాలు!
Deletewow chaala chaala bagundi..
ReplyDeleteధన్యవాదాలు!
Deleteమీ కథని గబగబానూ, యథాలాపంగానూ చదివెయ్యలేం. ఎక్కడ ఏ డీటెయిల్ మిస్సయిపోతామోనని ఒక ఉలుకు. ఏదీ సూటిగా చెప్పరు, కానీ అంతా మళ్ళీ క్లియర్ గానే ఉంటుంది. ఇది అద్భుతమైన, అరుదైన రచనాశక్తి. good show
ReplyDelete:) ధన్యవాదాలు!
Deleteమీ కథలో నిజాయతీ నచ్చిదండి.... మనసు తొలిచే కథ
ReplyDeleteధన్యవాదాలు!
Deleteచాలా చాలా బాగా రాశారు... మీ రచనా శైలి చాలా బాగుంది:-)
ReplyDeleteధన్యవాదాలు!
Deletestarting antha ardham ayi ardham kanatlu vundi,edo lunch break lo gaba gaba chadiveddam ani open chesa.but its definetly deeper than I thot and had to go out to finish it.excellent narration kothavakaya garu.
ReplyDeleteSri
:) ధన్యవాదాలు!
Deleteబాగుంది...రెండోసారి కూడా చదివాను:)))
ReplyDeleteకొసమెరుపు అదిరింది పొండి! మొత్తానికి ఇష్టం లేని పెళ్ళిని చేసిన వాళ్ళందరిమీదా బలేగా కసి తీర్చుకుంది.
ReplyDeleteధన్యవాదాలు!
Deletechala rojulu ayindi andi mee kadha chadivi
ReplyDeletevachhi choosukuni velutu untanu ...
eppatlage manasuni katti padese kadhalu...
evaridi tappu? evaridi oppu?
mee rachanallo chaala chaala goppa vishayam emito telusa??
they are non-judgemental...
kevalam jarigindemito cheppi, alochinchadam maaku vadilese kadhalu...
ilanti kadhala avasaram enthayina undi..
meeru rasukunna ilanti kadhalu anne kalipi oka pustakam prachurinchali ani korukuntunnanu...
అబ్బో ప్రశంసల వర్షంలో తడిపేసారుగా! :) మీ ఆదరానికి ధన్యవాదాలండీ. Judgements, Statements అవసరం లేదండీ పాఠకులకి. వాళ్ళు చాలా తెలివైనవారని నా నమ్మకం. Thanks for your encouragement!
DeleteBrilliant Narration !
ReplyDeleteYou compelled me to read
:) ధన్యవాదాలు!
DeleteI second Naraynaswamy garu. :)
ReplyDeleteheart touching...though the climax is intuitive, the narration is simply superb... roju matladukune matallone entha adbhutam chupistaru... hats off !!
-bittu
ధన్యవాదాలు!
Deleterendu saarlu chadavalsi vochchindi artham kaadaaniki. good climax
ReplyDeleteధన్యవాదాలు!
DeleteStory is really good.
ReplyDeleteధన్యవాదాలు!
Deleteఅద్భుతంగా ఉంది.
ReplyDeleteచెప్పీ చెప్పనట్టుగా చెప్పాల్సిన దంతా చెప్పేశారు. అదే కథని ఆసాంతం చదివేలా చేసింది.
ఎక్కడా అవసరంలేని పంక్తి కనిపించలేదు. నాకు బాగా నచ్చిన Transition. సీన్ కట్ చేసినట్టు క్రిస్ప్ గా ఉంది.
..................... ..................
ఆ వారం రోజులూ నిజాన్ని పూటపూటకీ కొద్దికొద్దిగా ఇంకేలా చేసాయి.
***
మరో నిద్రలేని రాత్రి తెల్లారింది. ఆమ్మ వచ్చింది.
***
నల్లగా రివటలా ఉన్నాడతను. నేనూహించినట్టే పెళ్ళి చేసుకోలేదట. హుషారుగా ఉన్నాడు.
.....................................
ఇంత మంచి కథకి ఇంకా మంచి పేరు పెట్టి ఉండవచ్చు కదండీ !
ప్రశంసకి ధన్యవాదాలండీ. 'ఇంకా మంచి పేరు..' అంతేనంటారా? :)
Deletekatha flow bagundi.
ReplyDeleteElurellali ane chaso kadha gurtuku techhindi. Flow chala bagundi. Kathanam kuda
ReplyDeleteచాలా బావుందండి
ReplyDelete