Saturday, April 30, 2011

మిలియన్ డాలర్ ప్రశ్నలు (సమాధానం లేనివి)

పిల్లలు చిన్నప్పుడే ముద్దొస్తారెందుకు?
కాఫీ తాగుతున్నప్పుడే ఫోన్ మోగుతుందెందుకు?
కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడే 'ఆచ్' వెళ్ళడం కుదరదెందుకు?
హాండ్ బేగ్ చేతిలో లేకపోతే నగ్నంగా ఉన్నామనిపిస్తుందెందుకు?
పోపు వేగుతున్నప్పుడే చిట్టితండ్రికి దెబ్బ తగులుతుందెందుకు?
వంకాయ కూర వండిన రోజే చుట్టాలొస్తారెందుకు?
మనం ఫోన్ చెయ్యని రోజే అత్తగారి పుట్టిన రోజవుతుందెందుకు?
ముప్పైయేళ్ళ కంటే ఇరవై తొమ్మిది చాలా చిన్న వయసనిపిస్తుందెందుకు?
జాన్ కార్బెట్ మా వెనకింట్లో పుట్టలేదెందుకు?
మనం వింటున్న హిందీ పాట ఇంట్లోవాళ్లకి " *** గోల" అవుతుందెందుకు?
నచ్చిన షర్ట్ మన సైజులో తయారు చెయ్యరెందుకు?
శనివారం రావడానికి ఆరురోజులు పడుతుందెందుకు?
సగం దూరం వెళ్ళాక 'తాళం వేసామా?'అనే అనుమానం ఎందుకు?
బబుల్ గం కంటే ఆవకాయ డొక్క రుచిగా ఉంటుందెందుకు?
మొగలి పొత్తి సువాసన కళ్ళు మూసుకుని ఊహించుకోగలమెందుకు?
తాతగారిని తలుచుకున్నప్పుడల్లా మన వయసు 'పది' దాటదు ఎందుకు?
పుస్తకం చదువుతున్నప్పుడు పక్క వారి ఘోష వినబడదెందుకు?
నచ్చిన పని చేసేందుకు ఇరవై అయిదో గంట పుడుతుందెందుకు?
చక్కగా కబుర్లు చెప్పే నేస్తానికి టైం అసలుండదెందుకు?
వీసా కార్డ్ కన్నా మూడు సింహాలున్న నోటు అందంగా ఉంటుందెందుకు?
రూపాయికి నలభై ఎనిమిది డాలర్లవలేదెందుకు?
నాన్న ఇచ్చిన డబ్బులే 'మన సొంతం' అనిపిస్తాయెందుకు?
అమ్మ ఇంటికి మన మంచం కింద నుంచి సొరంగమార్గం ఉండదెందుకు?

20 comments:

 1. amma intiki mancham kinda nundi sorangam vundadenduku,,,
  sooper..
  anni bagunnayi,,,

  ReplyDelete
 2. మిలీనియం ప్రశ్నలు. బాగున్నాయ్.
  ప్రసాద్

  ReplyDelete
 3. Meeru intha andamga prashninchetanduku..

  ReplyDelete
 4. idi chaduvutunnappudu ma vadu vese prasnalu gurtostunnayenduku...yaksha prasnalu ananu gani bale rasave bangaram....

  ReplyDelete
 5. శుక్రవారం రాత్రే కొత్త బ్లాగు పుడుతుందెందుకు??

  ReplyDelete
 6. మెచ్చుకున్న వారికి ధన్యవాదాలు. సంతోషం.
  @ ఉషమ్మ
  ప్రశ్నలు పుట్టేవే పిల్లల నోళ్లలోంచి. నచ్చిందా? థాంక్స్.
  @ రాజన్ గారు
  నా ప్రమధ గణాన్ని వదుల్చుకొని ప్రశాంతంగా నేను కంప్యూటర్ తో కాపురం చెయ్యగలిగేది ఒక్క శుక్రవారం రాత్రే. అందుకని.

  ReplyDelete
 7. "చక్కగా కబుర్లు చెప్పే నేస్తానికి టైం అసలుండదెందుకు?"

  దీనికొక్కదానికి సమాధానం ఆలోచించవే....నీకు మిలియన్ డాలర్లు ఇస్తాను కావాలంటే :D

  ReplyDelete
 8. అమ్మ ఇంటికి మన మంచం కింద నుంచి సొరంగమార్గం ఉండదెందుకు?

  WOW!!

  ReplyDelete
 9. Naku anni q^ns WOW!! laage anipistunnay!! aa last di aithe super :) adedo meeku teliste naaku chebuduru....nenu vesta sorangam maa intiki...maa amma intiki :D

  ReplyDelete
 10. @ ఓ సౌమ్యా!
  సమాధానం ఉంటే కాల్ చేసే చెప్పేదాన్నే! మిలియన్ మిస్ అయ్యానా? వా...కేర్..కేర్.. :'(

  @ కొత్తపాళీ,
  :) ( పలుకే బంగారమాయెనా? మందహాసం మహా ప్రసాదమనుకోనా?)

  @ కుమారన్
  సంతోషం

  @ ఇందు
  అదే తెలిస్తే ఈ పోస్టే ఉండేది కాదు కదా! మీ wow కి, నా yayy :)

  ReplyDelete
 11. This comment has been removed by the author.

  ReplyDelete
 12. This comment has been removed by the author.

  ReplyDelete
 13. ఇలా మా పెదాల చివర చిరునవ్వు పుట్టిస్తారెందుకు మీరు ?

  ReplyDelete
 14. ముప్పైయేళ్ళ కంటే ఇరవై తొమ్మిది చాలా చిన్న వయసనిపిస్తుందెందుకు?
  :))
  పుస్తకం చదువుతున్నప్పుడు పక్క వారి ఘోష వినబడదెందుకు?
  ఇది నాకూ మిలియన్ డాలర్ల ప్రశ్నే.

  టపా బాగుంది.

  ReplyDelete
 15. Wow...నిజంగా మిలియన్ డాలర్ ప్రశ్నలే

  ReplyDelete
 16. ఇలాటి ఆలోచనల ప్రవాహం ఇంకెవరిలో కనబడెందుకని

  ఎప్పటికి పాత బడని కొత్తావకాయ పేరు పెట్టుకోవడం

  you only deserve this name

  thanks for a nice post

  ReplyDelete
 17. correction కనపడదెందుకని

  ReplyDelete
 18. "అమ్మ ఇంటికి మన మంచం కింద నుంచి సొరంగమార్గం ఉండదెందుకు?"
  - ఇక్కడి నుంచి స్వర్గానికి సొరంగాలుండవు. నిచ్చెనలే ఉంటాయి :) :P :P

  ReplyDelete
 19. ఇలాంటి మంచి మంచి థాట్స్ మీకే వస్తాయందుకు??
  :-)
  సౌమ్య గారి ప్రశ్న సూపర్ :)

  ReplyDelete