ఓ నెల క్రితం ఈ వింత కండూతి మొదలయ్యిందనుకుంటా. .
వీరాంజనేయుడికి బాకా ఊదిన వానర సేన లా, అది నాలో గురక లు పెడుతున్న కవిని పని గట్టుకొని గోకి నిద్ర లేపి " నీకేంటి..నీకొచ్చిన లోటేంటి.. బ్లాగు లేని ఈ బతుకు నీకేంటి?" అని చెవినిల్లు కట్టుకు పాటలు పాడింది.
అంతే.. బ్లాగు రాసెయ్యాలని నిశ్చయించేసుకున్నాను. ప్రపంచం లో ఉన్న మూడు లక్షల తొంభై వేల ఆరు వందల ఇరవై తొమ్మిది తెలుగు బ్లాగుల కి ఇంకొకటి చేరింది.
శతకోటి లింగాల్లో ఇదో బోడి లింగం.. అదన్నమాట.