ఆషాఢం వెళ్తూ వెళ్తూ కొత్తకాపురానికి పచ్చ జండా ఊపి వెళ్ళిందేమో.. ఓ గూట్లోకి చేరిన ఆ నవదంపతులు హుషారుగా కాలం గడిపేస్తున్నారు. ఓ వారాంతపు ఉదయం ఏం జరిగిందంటే..
"సీతమ్మ పెనివిటీ సీరామ చంద్రుడూ ఆజానుబాహుడమ్మా.. చూడగా అబ్బాయి హరవింద నేత్రుడమ్మా.."
"హరవింద ఏవిటీ..? "అరవింద" తెలుగు మేష్టారమ్మాయివి మళ్లీ!"
"ఏం కాదు. 'బుచ్చిలక్ష్మి' అల్లాగే పాడుతుంది."
"పిల్లా.. చూసావా?వంకాయలు ఎంత తాజాగా ఉన్నాయో!!కుమిలి వంకాయలు."
"పచ్చడికి తాజా వంకాయకంటే వాడినవే శ్రేష్ఠం."
"నీకెవరు చెప్పారోయ్! నిన్న కాక మొన్నేగా గరిట చేత పట్టావూ.. పాకశాస్త్రం ఔపోసన పట్టిందాన్లా చెప్పేస్తున్నావ్!!!"
"అప్పదాసు అంటాడు. పచ్చడిలో కొత్తిమీర దూడ మేతలా ఊరిఖే వేసెయ్యకుండా.. అసలు విషయాన్ని మింగేయకుండా తత్వాలు పాడేటపుడు తంబూరా శ్రుతిలా ఉండాలటా!!"
"సరిపోయింది!"
"ఆ.. అసలు శాకాల్లో ఘన పంచరత్నాలని చెప్పేసి ఉన్నాయట! గుత్తి వంకాయ కూరా.. కందా బచ్చలీ, మంచి గుమ్మడీ శనగపప్పూ.."
"పనసపొట్టు ఆవకూర..."
"మీకెల్లా తెలుసూ.. 'మిథునం' చదవలేదంటిరే!"
"పనసపొట్టు కూర గురించి తెలుసుకోడానికి పుస్తకాలు చదవక్కర్లేదోయ్! తెలుగు నేలలో పుట్టి, దంతసిరున్న వాడెవ్వడైనా చెప్తాడు. ఇంతకీ ఏవిటా మిథునం? వంటల పుస్తకమా, ఏం?
"హవ్వ.. హవ్వ..!!"
"చాల్లేవో, నీ వేళాకోళం. ఆ నవలేదో ఇచ్చేమాటుందా లేదా?"
"నవల కాదు. కథ"
"ఓస్.. కథా. నేనింకా పేద్ద నవలనుకున్నానే.. నువ్వింతలా ఊదరగొట్టేస్తూ ఉంటే"
"నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల!"
"అబ్బో.. మంచి వకాల్తాయే తీసుకుంటున్నావ్!"
"ఏం చేస్తున్నావమ్మాయ్?"
"అంట్ల పిల్లలకి నీళ్ళు పోస్తున్నాను. ఏం కావాలటా?"
"భుక్తాయాసానికి విరుగుడు తాంబూల సేవనమూ, పుస్తక పఠనమూను."
"ఇంకా భుక్తాయాసమూ బీరకాయా అంటారేంటీ! ఎడాకటి వేళయిపోతూంటే!"
"పోనీ ఇంకో వక్కపలుకు తెచ్చి పెట్టి.. ఏదీ ఆ పుస్తకమేదో ఇలా ఇచ్చి వెళ్దూ!"
"మరే! కూటి కునుకు బాగా పడుతుంది పుస్తకం చేతిలో ఉంటే."
"హ్మ్..చదివే పుస్తకాన్ని బట్టి ఉంటుంది."
"ఇదిగో.. నిద్ర వచ్చిందో, రాలేదో చదివాక మీరే చెప్పండి ."
"నువ్వూ ఇక్కడే ఉండకూడదూ, నీకు అంత నచ్చేసిన కథ కదా! ఏ వాక్యానికావాక్యం ఇద్దరం ఓ మాటనేసుకోవచ్చు."
"వద్దులెండి. నా అభిరుచులేవో మీకు బలవంతంగా అంటించానని అపప్రథ నాకెందుకు? నచ్చితే చదవండి. లేదా గురక పెట్టి బజ్జోండి. అలా కూడా పుస్తకం హస్త భూషణమే!"
"అంత ఉడుక్కోకోయ్! నీకు అంత నచ్చిన కథ నాకు కొంతైనా నచ్చదా! నచ్చుతుందిలే."
"సరే అయితే.. నేనేం మాట్లాడను. "
"ఊ.. అప్పటికే పొద్దు వాటారింది."
"ష్ష్.."
"......"
"......"
"ఓపెనింగే ఓఘాయిత్యం మాటలూ.. ఏవిటోయ్ ఈ బుచ్చి లక్ష్మి!?"
"తినబోతూ రుచడుగుతారేం? బుచ్చిలక్ష్మి నోట పొల్లు మాట రాదులెండి కానీ, మాట్టాడకుండా చదువుకోండి. "
"వార్నీ ముసలి ఘటమా.. మీ అప్పదాసు తక్కువ వాడేం కాదో.. సతీ సహగమనం కోరుతున్నాడు. పాపం బుచ్చి లక్ష్మి!"
"అప్పుడే ఏవయిందీ.. "
"..."
"ఎవడి రుచి బతుకులు వాడివి. ఎంత కొడుకులైతే మాత్రం అకారణంగా వాళ్ళమీద వాలిపోకూడదు..నిజం కదూ! మంచి ఫిలాసఫీ అప్పదాసుది. అందుకని నూనెలో ముంచి తీసిన యేకులాంటి ఎనభైయేళ్ళ ముసలాయనా.. పెళ్ళామూ ఒంటరిగా ఉంటున్నారా! వింతే!"
".. "
"హహ్హహా"
"?"
"వెర్రి పుచ్చలు కాదు. నా బిడ్డలు రత్న మాణిక్యాలని బుచ్చిలక్ష్మి మురిపెంగా వెనకేసుకొస్తూంటే నవ్వొచ్చింది. తల్లి ప్రేమ! అయినా కొడుకుల దగ్గరికి తల్లిని వెళ్ళనివ్వకుండా ఆకట్టడం నేరం"
"చూస్తిరా! అప్పుడే బుచ్చి లక్ష్మిని వెనకేసుకొచ్చి అప్పదాసుగార్ని అనేస్తున్నారు!"
"హ్మ్.. "
"బావి గట్టుకి అందిపుచ్చుకునట్టు ఎప్పుడూ ఉరక తగిలే చోట అయిదారు అరటి చెట్లూ.. అమ్మకొంగు పట్టుకుని నిలబడ్డ పిల్లల్లా వాటిపిలకలూ.. అబ్బబ్బబ్బో.. ఏం చెప్పాడయ్యా! బుచ్చి లక్ష్మీ - పిల్లలూ ఇల్లాగే ఉండే వారేమో ఓ కాలంలో!"
"హహ్హహ్హహా.. మంచి ఊహే!"
" రోజూ నీళ్ళడగని బాదం చెట్టు ఓ మూలనా, పక్కనే ఉన్నా తోటి కోడళ్ళలా అంటీ ముట్టనట్టు దబ్బా, నిమ్మా ఉన్నాయా.. పొల్లు మాటొక్కటుందా అని! ఒక్కో మాటా ఒక్కో మాణిక్యంలా జిగేల్మంటూ ఉంటే!"
"ఊ.."
"విన్నావా.. "నేల మీద చుట్టలు చుట్టలుగా అల్లుకున్న గుమ్మడి పాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేష పాన్పులా.. ఇల్లెక్కిన ఆనప్పాదు అనూపంగా అల్లుకుని కప్పుని కపేసినప్పుడు ఆ బొమ్మరిల్లు అద్దంలో కొండ! తులసి కోట చుట్టూ పరిచారికల్లా మందారాలూ మంకెనలూ కాగడాలూ.. కోట స్థంభాల్లా కొబ్బరి చెట్లూ.. వాటి మానుల చుట్టూ దవనం, మరువం చేమంతీ చేరి స్థంభాలకు పచ్చలూ కెంపులూ పొదిగిన పొన్నులు తొడిగినట్టే" .. గాభరా వచ్చేస్తోంది.. అహ్హా.. ఏం తోటా ఏం తోటా..మా శేషమ్మామ్మగారి పెరడు గుర్తొచ్చేస్తోంది. చెప్పానా నీకు? శృంగవరపు కోటలో ఎకరం పెరడూ, మండువా ఇల్లూ అని. ఉండు మళ్ళీ చదవనీ!"
"హహ్హహా.. అచ్చం నాకూ ఇల్లాగే అనిపించింది మొదటి సారి చదివినప్పుడు! దార్లో పడ్డారన్నట్టే! ఆ.. చెప్పారు. పెళ్ళికి మీ తరపు వాళ్ళలో పెద్ద కానుక చదివించింది ఆవిడేగా. వెండి ఉగ్గుగిన్నె."
".."
"అబ్బా..స్స్.. గిల్లడాల్లేవ్. ఉడుక్కోడాలు అంతకన్నాలేవ్"
"అబ్బబ్బబ్బా.. తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా అని కొట్టుంటున్నారయ్యా మొగుడూ పెళ్ళాలూను.. మరీ ఉప్పూ నిప్పూను!"
"తినగా తినగా గారెలు చేదని మనమూ, ఇంకా మాట్టాడితే ప్రతి మనువూ అంతేనేమో! కొత్తొక వింత!!"
"అబ్జెక్షన్ యువరానర్. అభాండమ్స్ వెయ్యవలదు. నాకు పాత రోతేం కాదని నీకు నిరూపిద్దామంటే నువ్వు నా ఏకైక మొదటి పెళ్ళానివాయె!"
"హహ్హహా.. మీకు నేను చాలు కానీ..రామాయణంలో పిడకల వేటా..!"
"చూడు.. అంతలోనే సత్సంగత్యమని పెళ్ళానికి జామ కాయ నమిలి పెట్టాడు! మా మగాళ్ళ మనసు వెన్న."
"ఆహా..ఆడాళ్ళ మనసేమో కవ్వమూ కుంపటీను? చదవండి కబుర్లాపి."
"హహ్హహా.. వెర్రి బుచ్చి లక్ష్మి! మరీ ఇంత అమాయకురాలేం! "ఉల్లి మన నేలన ఊరదురా.. చూసాంగా!" అని పెనివిటిని పట్టిచ్చేసిందీ!"
"బుచ్చి లక్ష్మి అమాయకత్వం ఇప్పుడేం చూసారు! ముందుంది."
"ఈ నక్షత్రకుడు మాత్రం పాపం తెగ తిట్లు తింటున్నాడు. "తోకచుక్క లా నా కొంప చుట్టూ తిరుగుతావేమిట్రా!" అని ఆడిపోసుకుంటున్నాడు అప్పదాసు!..హహ్హహా!!"
".."
"ఈ అప్పదాసుకి పొద్దస్తమానం తిండి రంధేనా.. ఏం? కానీ శబ్బాష్ .. ఇతగాడి మాటే మాట!! "ధప్పళం తెర్లుకుంటే క్షీరసాగర మథనంలా కోలాహలంగా ఉండవలె.. పోపు పడితే తొలకరిలా ఉరిమి రాచ్చిప్పలో ఉప్పెన రావలె - నా శార్ధం రావలె.. " హ్హహ్హహ్హా.. బుచ్చి లక్ష్మి ముక్తాయింపు మాత్రం అద్దిరిపోయింది."
"హ్మ్మ్.. మరే.. మీ మగాళ్ళు! కడుపే కైలాసం సాపాటే పరమావధీను."
"ఆ మాటకొస్తే కోటి విద్యలూ కూటి కొరకేగా! అయినా మా మగాళ్ళని ఆడిపోసుకోనేల బాలా? వండుకున్నమ్మ తినక మానుతుందా!
"సరే, పిండి రుబ్బుకుని పెసర పుణుకులు వేసుకు తినొస్తాను. వండుకునేదీ నేనే. తినేదీ నేనే. మీకు మాత్రం అంతా మిధ్య. చదూకోండి. కథ రసకందాయంలో పడుతోందిగా.. రసపట్టులో తర్కం కూడదని గీతాచార్యుడు మాయాబజార్లో చెప్పాడు కూడాను!"
"రాక్షసీ"
"ఆనక 'రాకా శశీ' నేనే అంటారు.. పెసర పుణుకులూ, అల్లం పచ్చడీ కమింగ్ రైట్ అప్"
పచ్చీ మిర్చీ కొత్తిమీర, తంబూరా శ్రుతిలా తగిల్చిన తత్వంలా వేడివేడి పెసర పుణుకులూ, రుద్రాక్ష పరిమాణంలో ఇంగువ పోపుతో అల్లం పచ్చడీ వంటింట్లో రూపు దిద్దుకోవడం పూర్తయ్యే సమయానికి, మౌనంగా వచ్చి ఆమెని వెనక నుండి కావలించుకున్నాడు. జ్వరం తగ్గి మంచం దిగొచ్చిన పిల్లాడిని సవరదీసినట్టు, మునివేళ్ళతో అతని తల నిమురుతూ ఉండిపోయింది తను.
"కథ ఇలా ముగిసిందేమనిపించట్లేదు!"
"అదే కదా! ఎందుకో ఇంతకంటే వేరే ముగింపు ఊహకి కూడా అందదు."
"..."
"మీకెవరు నచ్చారు! నాకయితే బుచ్చిలక్ష్మి అంటే మహా ఇష్టం. మీకు అప్పదాసు నచ్చుతాడేమో!"
"ఊహూ.."
"మరి!"
"వాళ్ళిద్దరూ కాదు. దీవెన్ల ఫకీరు ఆకా తోకచుక్క వెధవ నచ్చాడు."
"హహ్హహ్హా.. ఊహించలేదు సుమీ!"
"మనని మనం ఏ పాత్రతో ఎక్కువ పోల్చుకుంటామో వారేగా ఎక్కువ నచ్చుతారు కదా!"
"అయితే మీకు అప్పదాసూ, బుచ్చిలక్ష్మీ ఇద్దరూ చెప్పలేనంత నచ్చేసారు. దీవెన్ల ఫకీరుకి నచ్చినంత!"
"ఊ.. ఈ కథ నీకు కంఠతా కదూ! బహుశా నాక్కూడానేమో ఇక నుంచీ"
"కంఠతా, కరతలామలకమూను. పుల్ల పుల్లగా, తిన్నాక తీపి మిగిల్చే ఉసిరికాయలా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే మంచి అనుభూతి ఎన్నిసార్లు చదివినా దొరికేస్తుంది. "ఎందుకూ..? " అని ఆలోచించేదాన్ని. బహుశా అప్పదాసు గారూ, బుచ్చిలక్ష్మీ ఉన్నట్టు ఇంకొకరు ఉండలేరు, ఉండాలని ఆశ లేనివారూ ఉండరు. అదే అనుకుంటా ఈ కథ విజయరహస్యం."
వంటింటి కిటికీలోంచి ఇంటి వెనకున్న బీడుకి అడ్డం పడి వస్తున్న పశువుల మందని చూస్తున్నాయ్ వాళ్ళ కళ్ళు మౌనంగా. దూరంగా ఆవుల అంబారవాలూ, కాపరుల అదిలింపులూ, మాటలూ వినిపిస్తున్నాయి.
"ఏట్రా పైడితల్లీ ఎర్రావు ఈతకొచ్చీసినాదేటి! జున్నెప్పుడెడతావ్?"
"నేదు మావా.. మూన్నెల్లాగాల! దీపాలమాసెక్కానీ ఈనదురా మా ఎర్రమాలచ్చిమి!"
మందలో ఆఖరుగా, నారింజ ధూళి రేపుతూ భారంగా సాగిపోతున్న ఎర్రావుని చూస్తూంటే.. అప్పదాసు గారు దాని ఒళ్ళంతా నిమిరి "మళ్ళీ జున్నెప్పుడు పెడతావమ్మా?" అని అడిగి, తన వాటా శనగల్లో గుప్పెడు ఆప్యాయంగా తినిపించిన కామధేనువు గుర్తొచ్చింది ఆ ఇద్దరికీ.. ఒకే సారి. "మిథునం" మరి కొన్నేళ్ళు .. ఇంకా ఎక్కువే గుర్తుండిపోతుందేమో!!
**********
* శ్రీరమణ "మిథునం" కథ మరోసారి చదివిన సందర్భంలో.. శతపోరి నాచేత ఈ కథ చదివించిన నేస్తానికి చిరుకానుకగా..
తెలుగు పాఠకులకు చిరపరిచితమైన ఈ కథపై చర్వితచర్వణమే అయినా సమీక్ష రాయమని ప్రోత్సహించిన బ్లాగ్మిత్రులు "అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!" శంకర్ గారికి ధన్యవాదాలు.

bale undi andi....venakki velli natlu..
ReplyDeleteకొత్తిమీర పచ్చడికి ఇంగువ పోపు పెట్టినట్టు ఘుమఘుమ లాడి పోయింది 'మిధునం'కి మీ వ్యాఖ్యానం. మిధునం చదువుతూ అప్పదాసు, బుచ్చిలక్ష్మి కనిపించేసారు. దర్శనభాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteHmm. ఒరిజినల్ కథ చదివినా, చివరిదాకా ఇంట్రస్టింగ్ గా ఉండింది.
ReplyDeleteఅద్భుతం అండీ......
ReplyDeleteఇంతకన్నా మాటల్లేవ్ ప్రస్తుతానికి...
ఏం చెప్పడానికీ మాటల్లేవ్ కొత్తావకాయ గారూ!!!! కధని ఈ విధంగా కూడా సమీక్షించ వచ్చా అని భలే ఆశ్చర్యమేసింది... అసలు ఆ పదాలు మీ చేతిలోపడేసరికి ఎన్ని హొయలు పోతాయో కదా అనిపిస్తుంది, మీ శైలి చూస్తుంటే!!! జూనియర్ బుచ్చిలక్ష్మి అప్పదాసులు కూడా నాకు బోల్డంత నచ్చేశారండీ! :-)
ReplyDeleteఅంత మంచి కథకు ధీటైన సమీక్ష. ధన్యోస్మి కొత్తావకాయ్ గారూ ధన్యోస్మి. ఇదే నేను ఆశించింది.
ReplyDeleteఅమ్మో ఇంతుందా?
ReplyDeleteమిథునం పుస్తకాన్ను అరువుకు తెచ్చుకుని చదివేయాలి...
బాగా రాశారు.
I read this book about 2 years ago. I liked it. When I read it again, I liked it much more.
ReplyDeleteBut when I read your post about this book, I am feeling like this book came to life.
Thanks
Hima
Meeru cheppinantha chakkaga inkevaru cheppalemo andi.
ReplyDeleteFirst time ee book 2 years back chadivanu. I liked it. When I read it again after sometime, I liked it further.
But ippudu meeru cheppindi chaduvuthunte, its just superb anipistundi.
All all the commentators said, its just a great book, and great post.
Thanks
Hima
కథకు తగిన సమీక్ష కోవా గారు.. ఎప్పటిలానే అద్భుతంగా రాశారు.
ReplyDeleteఅద్భుతం !
ReplyDeleteఅద్భుతం అండీ...ఇంతకన్నా మాటల్లేవ్ ప్రస్తుతానికి...
ReplyDeleteచాలా బావుందండి.
ReplyDelete"పుల్ల పుల్లగా, తిన్నాక తీపి మిగిల్చే ఉసిరికాయలా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే మంచి అనుభూతి ఎన్నిసార్లు చదివినా దొరికేస్తుంది..." నిఝంగా నిఝం ....
మీ సమీక్ష గురించి వేరే మాటల్లేవు కానీ ఈ కధ పేరువిని చదివినట్లే గుర్తు. కానీ మొత్తంగా గుర్తు రావట్లేదు బుర్ర గోక్కుంటూ నేను.
ReplyDelete@ శశి కళ: ధన్యవాదాలు.
ReplyDelete@ జ్యోతిర్మయి: ఇంగువపోపుకి కరివేపాకు ముక్తాయింపులా ఉంది మీ వ్యాఖ్య! ధన్యవాదాలు.
@ KumarN: ధన్యవాదాలండీ.
@ మురళి: ధన్యోస్మి!
@ నిషిగంధ: జూనియర్ అప్పదాసూ, బుచ్చిలక్ష్మి అని వాళ్ళకి పట్టం కట్టేసారుగా మీరూ, జ్యోతిర్మయిగారూ! ఎంత పెద్ద ప్రశంస!! చాలా సంతోషం. ధన్యవాదాలండీ!
@ SHANKAR.S : మిమ్మల్ని మెప్పించగలిగినందుకు చాలా సంతోషంగా ఉందండీ. ధన్యోస్మి!
@ అవినేని భాస్కర్: చదివేయండి మరి! ధన్యవాదాలు.
ReplyDelete@ Hima: చాలా సంతోషం. ధన్యవాదాలండీ!
@ వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు!
@ Sravya Vattikuti: ధన్యవాదాలండీ!
@ శ్రీనివాస్ పప్పు: ధన్యోస్మి!
@ తృష్ణ: కదా! హమ్మయ్య! శీర్షిక సార్ధకమయినట్టే. ధన్యవాదాలండీ!
@ sunita: హహ్హహా.. మరో సారి చదివేయండీ. ధన్యవాదాలు!
కొత్తావకాయ గారూ.. అద్భుతం. కధ ఎంత బాగా పరిచయం చేసారో అప్పదాసు, బుచ్చిలక్ష్మిలని, తెలీని వాళ్ళు కూడా అమాంతం వాళ్లతో ప్రేమలో పడిపోయేటట్టు.
ReplyDeleteఎన్నిసార్లు చదివినా, ప్రతీసారీ అదే మొదటి సారేమో అన్నంత దీక్షగా లీనమయి చదువుతాను ఎప్పుడూ. ఎన్నిసార్లు చదివినా వాళ్ళిద్దరూ నాకెప్పుడూ అపురూపంగానే కనిపిస్తారు. నాకు బుచ్చిలక్స్మిఅంటేనే ఇష్టం.... కాదు అప్పదాసు...ఉహూ కాదు కాదు బుచ్చిలక్ష్మే.... అబ్బా అలా కాదు గాని ఇద్దరూనూ. ఒకరు లేకుండా ఒకరు లేరు, కధే లేదుగా.. ఈ ఒక్క కధ రాసినందుకే శ్రీరమణ గారికి వీరాభిమానిని నేను. అఫ్కోర్సు బంగారు మురుగు కూడా అనుకోండి. బంగారు మురుగు అనగానే నాకు "ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి. నువ్వు ఆకు వక్క వేసుకుంటే అమ్మడు నోరు పండాలి." అంటూ ఇంకేదో గుర్తొచ్చింది. మీకేమైనా గుర్తొచ్చిందా. :-))) అలాగే అదే చేత్తో ఓసారి బంగారు మురుగు కూడా మాతో తొడిగించెయ్యరూ.... ప్లీ....జ్.
నిషీ, జూనియర్ అప్పదాసూ, బుచ్చిలక్ష్మి. :-) ఐ లైక్ ఇట్.
బావుందోయ్...నీ కథనం చూస్తుంటే నాకు కన్యాశుల్కంలో శిష్యుడు మహేశం గుర్తొచ్చాడు.
ReplyDelete"మృగాఃప్రియాళుద్రుమమంజరీణాం - యేం గొప్పమాట చెప్పాడోయ్ కవి! లేళ్ళు పరిగెత్తితే యవడిక్కావాలి, పరిగెత్తకపోతే యవడిక్కావాలి? ఏం కుక్కలు పరిగెత్తుతున్నాయ్ కావా? నక్కలు పరిగెత్తుతున్నాయ్ కావా?
వణప్రకషె సతి కర్ణికారం - ఆ పువ్వేదో కవికిష్టం లేదట. యిష్టం లేకపోతే ములిగిపోయింది కాబోలు?"
ముఖ్యంగా "ఓపెనింగే ఓఘాయిత్యం మాటలూ.. ఏవిటోయ్ ఈ బుచ్చి లక్ష్మి!?" అని చదవగానే నాకు పై సన్నివేశమే గుర్తొచ్చింది :)))
సూపరండీ..!
ReplyDelete@ పద్మవల్లి: ఓపలేని బరువు నా భుజాల మీదకి నెట్టేయడం భావ్యమా అధ్యక్షా!? మీకున్న పాత బాకీలు చెల్లించనీండి ముందు. అప్పుడు 'బంగారు మురుగు' సంగతి చూసుకుందాం. :) ధన్యవాదాలు.
ReplyDelete@ ఆ.సౌమ్య: "వర్ణప్రకర్షే.." హహ్హహ్హహా.. కాళిదాసు ఒక్కడే కానీ, కవిత్వానికి వంకలు పెట్టేవాళ్ళు లక్షలు కదూ! మంచి ఊహే! థాంక్స్! :)
@ రాజ్ కుమార్: ధన్యవాదాలండీ!
మీ టపాకు నేను కామెంటు రాయడం ఇదే ప్రధమం.మిధునాన్ని సమీక్ష చేయ్యడానికి మీరెన్నుకున్న పద్ధతి మిధునమంత అద్భుతంగా వుంది.వెంటనే రాయాలని అనిపించింది.ప్రింటు ఐన ప్రతిసారి మిధునం సంచలనం సృష్టిస్తూనే వుంది.ఆనందంతో కూడిన బాధ లాంటిదేదో కలుగుతుంది చదివిన ప్రతిసారీ.అప్పుడెప్పుడో మల్లాది సూరిబాబు గారు పాడినట్టు హాయి లోనేల యదకింత హింస అని.
ReplyDeleteబాగుందండి మీ విశ్లేషణ
ReplyDelete"మిథునం" కథ మీద, ఆ కథలో పాత్రల మీద మీ విశ్లేషణ బాగుంది.
తెలుగు సాహిత్యం లో ఒక మంచి కధను మాకు పరిచయం
చేసినందుకు ధన్యవాదాలు.
మీ ఈ విశ్లేషణ చదివాకా ఆ "మిధునం" ను ఎలాగైనా చదవలనుకున్నాను.
వెతగ్గా వెతగ్గా అంతర్జాలం లో ఓ మూల ఈ కథ తళుకు లింక్ దొరికింది.
ఉయ్యూరు సరస భారతి సాహితి అభిమానులు
ఈ "మిధునం" కథను ఆడియో ట్రాన్స్ క్రిప్ట్ చేసి ఈ లింక్ లో పొందుపరిచారు
మీరు ఇక్కడ ఆ శ్రీ రమణ గారి మిధునం కథను హాయిగా వినొచ్చు
శ్రీ రమణ గారి ఇంటర్వ్యు తో సహా
http://sarasabharati.wordpress.com/2011/09/
ఈ లింక్ లోకి వెళ్లి ఆఖరి అధ్యాయం లో ఉన్న శ్రీ రమణ కథ-మిధునం
మీద క్లిక్ చేసి ఆడియో వినండి.
మిథునం మీద ఎన్ని పోస్ట్ లు రాసిన , చదివినా తనివి తీరేది కాదు.
ReplyDeleteచాలా చక్కగా రాసారు.
శంకర్ గారు మిధునం పంపించి పదిరోజులైనా చదవడం కుదరలేదు. నిన్న మీ సమీక్ష చదివాను.ఆ తరువాత మిధునం చదివాను. ఈ వేళ మళ్ళీ ఇంకోమాటు రెండూ చదివాను.
ReplyDeleteమీ సమీక్ష గొప్పగా ఉంది. కధ అంత అందంగానూ ఉంది. సమీక్ష లోని బుచ్చిలక్ష్మి, అప్పదాసు లకు ఒక నమస్కారం.
beautiful.
ReplyDeleteకేకా ...సూపరు ....చాలా బాగా రాసారు.....మీరు గాని...????? ఎందుకులెండి ....!!!!
ReplyDelete@ Indira: నిజం కదండీ! తెలియని బాధా, దాన్ని మించిన హాయీ రెండూ కలుగుతాయి 'మిథునం' చదివిన ప్రతీసారీ. ధన్యవాదాలు.
ReplyDelete@ చైతన్యదీపిక: లంకె ఇచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ kallurisailabala: అవునండీ. ధన్యవాదాలు!
@ బులుసు సుబ్రహ్మణ్యం: కథతో పాటూ నా రాతలూ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు!
@ కొత్తపాళీ: ధన్యవాదాలు!
@ RAAFSUN: అలా ప్రశ్నార్ధకాలూ, ఆశ్చర్యార్ధకాల దగ్గర అర్ధోక్తి వదిలేస్తే ఎలాగండీ! ధన్యవాదాలు.
అరచేతిలో ఉసిరికాయ చాలా సరిగ్గా సరిపోయిన పదం ఈకధకు. భలే పేరు పెట్టారు.ఇది నేను అమెరికా వెళ్ళాక అచ్చైన కధ అండి. మరలా ఓ నాలుగేళ్ళకు వెనక్కు ఇండియా వచ్చాక ఎవ్రి దగ్గరో సీరియల్ గా కత్తిరించిన కధ చదివాను. అదీ పని మీద వెళ్ళి అక్కడ స్టక్ ఐ అందుకే పేరు తెలిసినట్లు ఉండి పూర్తిగా గుర్తు రాలేదు.ఆ తోట నాకు బాగా నచ్చింది. మొదటిసారి కూడా కధ ఆ తోటవెంట పరిగెడుతూ చదివానన్నమాట. గుంటూర్లో మా ఇంట్లో అంత పెద్దదికాదుకానీ పెద్ద తోటే ఉండేది.అదో నాస్టాల్జియా.ఇప్పటి ఓ 8 సార్లు చదివాను మీ మెయిలు వచ్చిందగ్గరనుంచి.మీ సమీక్ష ఇప్పుడు ఇంకా ఇంకా నచ్చింది.once again thanks!
ReplyDeleteSimply Superb! :)
ReplyDeleteSRI RAMANA GAARU CHAALAA KAALAM BAAPU-RAMANA VADDA UNNAARU.
ReplyDeleteAA AATMEEYATA VALLANEMO... MITHUNAM OKA PATRIKALO PRACHURITAM AYAAKA AA KATHAKI MUGDHULAINA BAAPU GAARU TANA CHETI RAATALO DAANNANTAA MALLI RAASARU.
BAAPUU RAMANAYEEMGAA MUSTAABAINA AA KATHANI SAI GARU TAMA RACHANALO PRACHURINCHAARU.
AJARAAMARAMAINA AA KATHA MARENTO MANDI SAAHITYABHIMAANULAKU ALAA ANDUBAATULOKI VACHINDI.
IPPUDAA BAPU GEETALA MITHUNAM OKKA KATHANII RACHANA SAI GARU PUSTAKAMGAA PRACHURINCHAARU.
MEE LAANTI MITHUNAABHIMAANULAMDARIKI AA PUSTAKAM KANNULA PANTE. PRAYATNINCHANDI.
PHANEENDRA
CHAITANYA DEEPIKA GAARUU..
ReplyDeleteAUDIO LINK KI DHANYAVAADAALU.
AUDIO TRANSCRIPT CHESINADI EVARU? TELUSAA?
PHANEENDRA
చైతన్య దీపిక గారూ...
ReplyDeleteలింక్ ఇచ్చినందుకు ధన్య వాదాలు.
కొత్తావకాయ గారూ..
సమీక్ష కొత్త తరహాలో చాలా బావుంది.
చాలా బాగుందండీ!
ReplyDelete--జంపాల చౌదరి
మిధునం కథ గుర్తుకుతెచ్చినందుకు ధన్యవాదాలండి :) మీ శైలి అధ్భుతం! ఇవాళ అంతా మీ బ్లాగుతోనే సరిపొయింది నాకు. ఈ కథ మా అన్నయ్య నాచేత చదివించాడు.. కథనీ, మా అన్నయ్యనీ గుర్తుచేసినందుకు సంతోషం. అఓరకమైన అనిర్వచనీయమైన అనుభూతికలుగుతుంది ఈ కథ చదివాక! మళ్ళీ చదవాలని వుంది :)
ReplyDeleteమిధునం ఏ సూపర్..అను కుంటే..మా వ్యాఖ్యానం..మరి ప్రాణం పోసుకుని, కళ్ళ ముందు..కనిపించేలా చేసారు.
ReplyDeleteవసంతం.
"మిథునం" ని మరిపించేట్టుగా వుంది మీరాసిన పద్ధతి ! రమణ గారిదే, మా తాతయ్యని (అమ్మమ్మ/ బామ్మని కాదు) ఎప్పుడూ గుర్తుకు తెచ్చే " బంగారు మురుగు" గురించి కూడా రాయకూడదు ?
ReplyDeleteఅద్భుతం..... అంతేనండీ.... (చాలా లేట్ గా)
ReplyDeleteవచ్చిన వాడిని ఆ స్వేచ్చా కుమారుడు చదువుకుని వెళ్ళచ్చు కదా ..ఇలా వచ్చి ఇక్కడే తిరుగుతున్నా ....బంగారానికి పరిమళం అద్దేసారుగా ..అద్భుతం !!
ReplyDelete