ఆ జ్ఞాపకాలింకా నవనవలాడుతూనే ఉన్నాయి. కాలయంత్రాన్ని అలవోకగా వెనుకకు తిప్పి.. ఆనాటి పచ్చిదనాన్ని మనోయవనికపై నిలుపుతున్నాయి. మక్కువ తీరక దాచుకున్న మొగలిపొత్తిలా మందసంలో దాగి, దరి తెలియని దారుల నడిచి నడిచి వేసారిన వేళల.. జీవనసౌందర్యాన్ని గుర్తుచేసి సాంత్వనపరుస్తూనే ఉన్నాయి. "జిలుగు పవడపు మబ్బుతెరలో తళుకుమనే నెలబాలుడి" పరిచయమెలా జరిగిందంటే.. గుర్తుచేసుకోడమెంత సౌఖ్యమో, జ్ఞాపకాలను ప్రోదిచేసి అక్షరాల ననలొత్తడం ఎంత కష్టమనీ..
స్వేచ్ఛాకుమారుడి పరిచయం.. తానా 20వ సంచికలో..