Thursday, July 16, 2015

స్వేచ్ఛాకుమారుడు


జ్ఞాపకాలింకా నవనవలాడుతూనే ఉన్నాయి. కాలయంత్రాన్ని అలవోకగా వెనుకకు తిప్పి.. ఆనాటి పచ్చిదనాన్ని మనోయవనికపై నిలుపుతున్నాయి. మక్కువ తీరక దాచుకున్న మొగలిపొత్తిలా మందసంలో దాగి, దరి తెలియని దారుల నడిచి నడిచి వేసారిన వేళల.. జీవనసౌందర్యాన్ని గుర్తుచేసి సాంత్వనపరుస్తూనే ఉన్నాయి. "జిలుగు పవడపు మబ్బుతెరలో తళుకుమనే నెలబాలుడి" పరిచయమెలా జరిగిందంటే.. గుర్తుచేసుకోడమెంత సౌఖ్యమో, జ్ఞాపకాలను ప్రోదిచేసి అక్షరాల ననలొత్తడం ఎంత కష్టమనీ.. 

స్వేచ్ఛాకుమారుడి పరిచయం.. తానా  20వ సంచికలో.. 

2 comments:

  1. కృ.శా (ఇంటి) ని చూసొచ్చారా....కొన్నిటిని చూడడానికి అదృష్టం ఉండాలంతే.పక్కనే ఉన్నా ఒక్కోసారి చూడలేము దూరాలెళ్ళాక వాటి విలువ తెలుస్తుంది.

    ఇక్షుసాగర రసాన్ని మీదైన పధ్ధతిలో మాకు రుచి చూపించినందుకు బహుదా ధన్యులమండీ

    ReplyDelete
  2. స్వేచ్చా కుమారుడి తో మీ పరిచయం చదువుతుంటే .. ఆ దృశ్యం కనబడి .. మహాప్రభో ... అందునా తరంగా లో మీ స్వరతరంగం సుపరిచయం కావటం తో ... ఈ అందమైన కథ మీరు చెపుతున్నట్టే అనిపించింది ... !!

    శ్రీరమణ గారి 'రైలు బండి లో వైతాళికులు' తన వంతు ... అత్తరు పూసింది.

    అవునండీ .." ఏడుగడ శ్రీ రామచరణమ్ .. తోడు పడ శ్రీ రామచరణమ్ " చూడటానికి మాములు పదాల లానే ఉంటాయి గానీ .. చదివిన ప్రతి సారీ రామపాదాల రేవు కి ప్రయాణం కట్టిస్తాయి ! ఏమిటొ ఆ రహస్యం !!

    "తరంగా" archives దొరకటం లేదు ఈ మధ్య.. మీ కార్యక్రమాలు వినాలంటే వేరే ఎక్కడ దొరుకుతాయో చెప్పమని ప్రార్ధన .
    భవదీయుడు
    రామ్

    ReplyDelete