ఓ నెల క్రితం ఈ వింత కండూతి మొదలయ్యిందనుకుంటా. .
వీరాంజనేయుడికి బాకా ఊదిన వానర సేన లా, అది నాలో గురక లు పెడుతున్న కవిని పని గట్టుకొని గోకి నిద్ర లేపి " నీకేంటి..నీకొచ్చిన లోటేంటి.. బ్లాగు లేని ఈ బతుకు నీకేంటి?" అని చెవినిల్లు కట్టుకు పాటలు పాడింది.
అంతే.. బ్లాగు రాసెయ్యాలని నిశ్చయించేసుకున్నాను. ప్రపంచం లో ఉన్న మూడు లక్షల తొంభై వేల ఆరు వందల ఇరవై తొమ్మిది తెలుగు బ్లాగుల కి ఇంకొకటి చేరింది.
శతకోటి లింగాల్లో ఇదో బోడి లింగం.. అదన్నమాట.
" నీకేంటి..నీకొచ్చిన లోటేంటి.. బ్లాగు లేని ఈ బతుకు నీకేంటి?"
ReplyDeleteనిజమే కదా మీకు ఆ ఆలోచన రాకపోతే మేము చాల మిస్ అయ్యేవాళ్ళం.
పది కోట్ల ఆంధ్రులకి నూరూరింప జేసే కొత్తావకాయ మీ బ్లాగు.
ReplyDeleteహహహ. మొదలుపెట్టిన సంవత్సరానికి మళ్ళీ బ్లాగు గుర్తొచ్చిందా.
ReplyDeleteఇంతకీ ఆ లక్షల లెక్కేమిటండోయ్? నిజంగా అన్ని తెలుగు బ్లాగులు ఉన్నవా ఏమిటీ?
enni blog lunna kottavakaya ruche veru
ReplyDeleteఅవునా.. మరేంటి నాకు కొన్ని బ్లాగులు కమ్మగా, కొన్ని ఘాటుగా, కొన్ని తియ్యగా, చాలా వరకు చెత్తగా కనిపిస్తున్నాయి... మీది మాత్రం... రంగు, రుచి, ఘాటు అన్నీ ఉండి... భలేగా అనిపిస్తోంది. ఎందుకంటారూ
ReplyDelete
Deleteపేరులోనే వుంది మజా కొత్తావకాయ గదా :)