వంకాయ బజ్జి పచ్చడిలో కొత్తిమీర ఎలా ఉండాలయ్యా అంటే "తత్వాలు పాడేటపుడు తంబురా శ్రుతిలా" అసలు విషయాన్ని మింగేయకుండా ఉండాలన్నాడు అప్పదాసు.
"నొష్ట రాసిన రాలు తుడిచినా పోదు - చీర చెరుగులు పెట్టి తుడిచినా పోదు - పైట చెంగుల తోటి పులిమినా పోదు" అని పాడేంత సర్వజ్ఞురాలు బుచ్చిలక్ష్మి. చూడబోతే ఇద్దరికిద్దరూ సంగీత సాహిత్యాలు కాచివడబోసినట్టే అనిపిస్తారు.
అచ్చ తెలుగు కథగా పుట్టి ప్రాణం పోసుకుని.. కాగితాల్లోంచి గుండెల్లోకి చరచరా నడిచివచ్చి, గూడు కట్టుకున్న ఆ "మిథునం" - చలన చిత్రమై వెండితెరపై కనువిందు చేయబోతోందని విన్నదగ్గరనుంచీ ఆత్రమే.. అనుమానమే.. ఆరాటమే! పాత్రధారులూ, చిత్రీకరణ.. "మిథునం"లో అతి ముఖ్యమైన భూమిక ఆ "తోట" ఎలా ఉండబోతోందా అనే ఆలోచనతో పాటూ సంగీతం గురించి కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.
ఎట్టకేలకు ఆడియో విడుదల చేసారు. మచ్చుకు చూపించారు. ఆ పాటల కబుర్లు.. నాకు తెలిసినవీ.. నాకు తోచినవీ.. కొన్ని.
తనికెళ్ళ భరణి దర్శకత్వంలో, శ్రీరమణ "మిథునం" స్వరవీణాపాణి చేతిలో స్వరాలద్దుకుంది. జొన్నవిత్తుల, ఆనంద్ ముయిద రావ్, తనికెళ్ళ భరణిల కలంలో సాహిత్యాన్ని వ్రాయించుకుంది. కే. జే. యేసుదాసు, బాలసుబ్రహ్మణ్యం, జమునా రాణి, స్వప్న, జొన్నవిత్తుల గళంలో వినిపించింది.
* "షట్పద ఝుంకారమో.. ఏమో..!" అని ఒళ్ళు పులకలు తేలేలా మొదలయ్యే యేసుదాసు గంధర్వ గాత్రంలో "ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిథునం.." అనే పాట ఎంత విన్నా చాలుననిపించడంలేదు.
దాంపత్య రసజ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం
అల్పసంతసపు కల్పవృక్షమున ఆత్మకోకిలల గానం
గృహస్థ ధర్మం సగర్వమ్ముగా తానెగరేసిన జయకేతనం
ఇలాంటి మెరుపులు తళుక్కుమన్న జొన్నవిత్తుల సాహిత్యం చక్కగా ఉంది. యేసుదాసు మంత్రజాలం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! జగద్విదితం.. అదో అద్భుతం!!
* నాకు అమితంగా నచ్చిన పాట - అప్పదాసునీ, బుచ్చిలక్ష్మినీ ఠక్కున కళ్ళెదుట నిలబెట్టిన పాట అలనాటి మేటి గాయని జమునా రాణి పాడిన "ఎవరు గెలిచారిప్పుడూ.. రంగా.. ఎవరు ఓడారిప్పుడూ.." ఆనంద్ ముయిద రావ్ వ్రాసారట.
పడుచు మనసున్నోడు పరుగులెడుతున్నాడు
అరవయ్యేళ్ళ పడుచు అలిగి కూర్చున్నాది
కలతలన్నీ కలిపి కలనేతలా నేసి
కన్నీళ్ళు ఒగ్గేసి కలిసి నవ్వేసారు
ఎవరు గెలిచారిప్పుడూ.. రంగా.. ఎవరు ఓడారిప్పుడూ
రెండు గుండెల చప్పుడూ.. రాగమొక్కటె ఎప్పుడూ..
* "పాకవేదం అపౌరుషేయం.. అంటే నీకెట్టా తెలుస్తుందీ.. నిరక్షర కుక్షివి.." అని బుచ్చిలక్ష్మిని ఆడిపోసుకుని శాకాల్లో ఘనపంచరత్నాల చిట్టా చదివిన అప్పదాసుకి ఓ మంచి పాకకళాసారం దట్టించిన పాట ఉండాలని భరణి అనుకున్నారేమో.. ఇదిగో ఆయన కలం నుంచే ఓ మాంచి రుచి కోరు రుచైన పాట.. "ఆవకాయ మన అందరిదీ.. గోంగూర పచ్చడీ మనదేలే"
ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ.. పెసరట్టులోకి అల్లమురా
దిబ్బరొట్టెకీ తేనె పానకం.. దొరకకపోతే బెల్లము రా
వేడి పాయసం ఎప్పటికప్పుడె.. పులిహోరెప్పుడు మర్నాడే..
మిర్చీ బజ్జీ నోరు కాలవలే.. ఆవడ పెరుగున తేలవలే..
గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా..
గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకుమురా..
పనసకాయ నీకున్నరోజునే పెద్దలు తద్దినమన్నారూ..
పనసపొట్టులో ఆవపెట్టుకుని తరతరాలుగా తిన్నారూ..
అని అప్పదాసు మైమరచి పాడుతూంటే బుచ్చిలక్ష్మి పెనం మీద ఆవగింజలా చిటచిటలాడడం మన కళ్ళముందే కనిపించేయాలి కదా.. అతి చమత్కారంగా ముక్తాయింపిచ్చింది మరి..! ఏమనీ..?
తిండి కలిగితే కండకలదనీ గురజాడవారు అన్నారూ..
అప్పదాసు ఆ ముక్క పట్టుకుని ముప్పూటలా తెగతిన్నారూ.. అని
భలే బుచ్చిలక్ష్మి కదూ! ఈ పాట బాలసుబ్రహ్మణ్యం, స్వప్న పాడారు. సాహిత్యం చదివితే ఓ మంచి పాటకి పేరడీ అని తెలిసిపోవడం లేదూ!
* "మావిడి పిందె కరష్టే కానీ.. అది చిలక కాదు.. ఉడత" అని ఇంగిలీషులో తేల్చి చెప్పింది కనుక బుచ్చిలక్ష్మి తన పెనివిటికి కాఫీ ఇస్తుందంటారా! ఇస్తుందేమో మరి! జొన్నవిత్తుల కాఫీ దండకమొకటి వ్రాసి, స్వయంగా పాడారు కూడా!
"అనుదినమ్మును కాఫీయె అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కూ
కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కూ
అమృతమ్మన్నది హం బక్కు అయ్యలారా.." అని సాగే ఈ దండకం "టేస్టేశ్వరి.. బ్రూకు బాండేశ్వరి" లాంటి చిత్ర పద విన్యాసాలతో నడుస్తుంది. "ఎలా ఉందీ.. నచ్చిందా?" అంటే సినిమా చూసేదాకా చెప్పలేను.
* ఎంతటి ఆనందమైనా ఒక ముగింపుకు రాక తప్పదన్న చేదునిజం.. భరణి రచన "ఆట గదరా శివా.. ఆట గద కేశవా.." యేసుదాసు గళంలో వింటూ ఉంటే మసక చీకటిలా కమ్మేస్తుంది.
ఆట గద జననాలు
ఆట గద మరణాలు
మధ్యలో ప్రణయాలు
ఆట నీకూ..
అయిదే పాటలు.. అలరించే పాటలు!
ఆడియో సీడీ కచ్చితంగా మీ ఇంట్లో చేరి మీకు వీనులవిందు చేయాల్సినది.. వెళ్ళి కొని తెచ్చేసుకోండి మరి!
"మిథునం" ఆడియో సీడీ
కీర్తన మ్యూజిక్
వెల: రూ 60/-, $5