Friday, February 28, 2014

గాలిసంకెళ్ళు ~ 15

కౌముదిలో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు"  ఇక్కడ.. 

'కౌముది'కి ధన్యవాదాలతో..

25 comments:

  1. "what!! అప్పుడే అయిపోందా... ఇంత తొందరగా ముగించారేమిటీ" అనుకున్నానండీ.. కాని మీరు మొదలుపెట్టి పదిహేను నెలలు అయిందంటే నమ్మశక్యంగా లేదు.. నిన్నో మొన్నో పరిచయమైనవాళ్లలా అనిపిస్తున్నారు వంశీ, మహతి, గౌతమి. ఇంకొంచెం పొడిగించాల్సింది... అఫ్‌కోర్స్ వంశీని గౌతమిని కలపకుండా ఉన్నందుకు మీమీద కంప్లయింట్స్ వచ్చేవేమో :)

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా.. :) ధన్యవాదాలు!

      Delete
  2. అభినందనలండి కొత్తావకాయ గారు!

    ReplyDelete
  3. First things first కొత్తావకాయ గారు , అసలు గబుక్కున అలా అయిపొయింది అని చెప్పేసారు ఏంటండి ?
    నాకు బా నచ్చిందండి . గత 15 నెలలు గా ఇలా పబ్లిష్ కాగానే అలా వెళ్లి చదవటం ఒక అలవాటుగా అయ్యింది :-))) పొతే మీరు ముగించటం మీద మాత్రం నాకు కొంచెం అసంతృప్తి ఉంది . ప్రేమ కి , కలిసి ఉండాలి అనుకోవటానికి బిజినెస్స్ డీల్ లాగా రోజుల తరబడి మీటింగ్స్ అక్కర్లేదు వాటికి పెద్దగా లాజిక్ వెతకనక్కర్లేదు అని నేను నమ్ముతాను కానీ, గౌతమి లాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి వంశీ మీద ఎంత ప్రేమ ఉన్నా అంత త్వరగా అలాంటి నిర్ణయం తీసుకుందా అనేది కొంచెం ఆశ్చర్యం వేసింది . నిజానికి ఫిక్షన్ లో ఇలా characters కోసం ఎవరన్నా ఎక్కువ బాధ పడుతుంటే నేను కొంచెం తమాషాగా చూస్తాను , ఆట పట్టిస్తాను కానీ ఏంటో ఇప్పుడు గౌతమి మంచి నిర్ణయమే తీసుకుందా , సీమ వల్ల తనకి తర్వాత ఎలాంటి ప్రాబ్లం రాదా అని కొంచెం దిగులేస్తుంది :-))))

    మొత్తం మీద బావుందండి , I thoroughly enjoyed the read ! Thank you !

    ReplyDelete
    Replies
    1. తెర మీద శుభం కార్డ్ పడడంతో ఏ కథా ఆగిపోదు కదా శ్రావ్యా. :) ఒక మలుపు దగ్గర ఆపేయడమే narrator పని. Open ending ని ఎంతగానో ఇష్టపడతాను నేను. 'ఏమై ఉండచ్చు? ఎలా జరిగితే బావుంటుంది?' అనేది ఎవరికి వారు ఊహించుకోవడమే బావుంటుంది. :) నన్నూ పాఠకురాలిగా మీరు లెక్కవేస్తానంటే కనుక, గౌతమి గతాన్ని, పుట్టిపెరిగిన పరిస్థితులని పరిగణనలోకి తీసుకుంటే, ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవడం నాకేం ఆశ్చర్యం కలిగించలేదు. వంశీ పై ప్రేమ కలగడానికి బలమైన కారణం ఆమె గతమేనేమో! ఇక ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నదీ చెప్తే జీవితమంత సీరియల్ అవుతుంది. అప్పుడు 'సాగదీస్తున్నారూ..' అని మీరే అంటారేమో. :)

      మొదటి ఎపిసోడ్ నుంచీ మీ ఆదరణ నాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. Thank you so much! :)

      Delete
  4. ​You have a very unique style of writing. Almost everyone says it I guess.
    In my opinion the best part is, you narrate/write few things in such a way that even the people who are totally against them also lost in there feels like it can't get any better than this. Hope you understood what I mean!

    The whole theme of this story is a very tricky one. It's definitely not an easy job to portray it in an acceptable and beautiful way. You have done it great I would say. Congratulations! :-)

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ చూడగానే చాలా సంబరమనిపించిందండీ. A big relief. :) బయటకి కనిపించని శ్రమని ఎవరైనా గుర్తిస్తే కలిగే సంతోషమది. ప్రతీ విషయానికీ supporters తో పాటూ Argument కూడా ఉంటుందని తెలిసిందే కదండీ. Vice versa. 'ఇరుపక్షాలకీ కథ వినిపించగలనా?' అనుకున్నాను. I am happy now! Thank you! :)

      Delete
  5. అపుడే అయిపోయిందా?? కౌముది రాగానే ముందు ఇది చదివాకే ఇంకోటి ఏదన్నా చూసేదాన్ని. ఒక్కో నెల ఖాళీ లేకున్నా కనీసం ఇదొక్కటే అయినా చదివి వెళిపోయేదాన్ని.

    నువ్వు ఎంతః సక్సెస్ అయ్యవూ అన్నదానికి నిదర్శనం పైన శ్రావ్య కామెంట్ ఒక్కటి చాలు. అదీ తన దగ్గర నుండి ఆ కామెంట్. :-) కంగ్రాట్స్.

    ReplyDelete
    Replies
    1. పద్మ గారు , హ హ మీకు నా మీద కోపం ఉంటె డైరెక్ట్ గా క్లాసు తీసుకోండి, నేను ఏమనుకోను :-)))

      Delete
    2. పద్మ గారూ, థాంక్యూ! నేనూ కథ ముగిస్తూ 'శ్రావ్య ఏమంటారో చూడాలి.' అనుకున్నాను. :)

      శ్రావ్యా, మీరు నమ్మితీరాలి. :) కథాంశమేదైనా అన్ని వర్గాల పాఠకుల చేతా చదివించగలగడమే ఆ కథ విజయానికి కొలమానం. కాబట్టి మీ స్పందన చాలా విలువైనది. :) థాంక్యూ!

      Delete
  6. Apude aipoindaa.....Krishna...

    ReplyDelete
  7. I am back :-)
    ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ అండి, పద్మా గారు అన్నది ఒక fictitious character మీద అభిమానం పెంచుకోవటం గురించి అని అనుకుంటున్నాను . It is nothing to do with the theme of the story :-)))

    నాకు ముగింపు అక్కడ ఆగిపోవటం గురించి కాదండి అసంతృప్తి ! గౌతమి వచ్చిన బాక్గ్రౌండ్ నుంచి చూస్తే నాకొందుకో కొంచెం మామూలు వాళ్ళకన్నా ఎక్కువ జాగ్రత్త ఆలోచన ఉంటుందేమో అనిపించిందండి . Anyway మీరు అన్నట్లుగా ఒకవేళ అలాంటి లైఫ్ చూసిన తరవాత వంశీని చూస్తే ఇంకా ఎక్కువ ఇష్టం ఏర్పడిందేమో ఇది కన్విన్సింగ్ గానే ఉందండి . సీమ , గౌతమి ఎదురుపడటం మాట్లాడటం అన్నది మహతి తో చెప్పించి between the lines చడువుకోమన్నారు . అది కథ కి అయితే బావుటుందేమో కానీ నవల లేదూ నవలిక ఏదో కొంచెం పెద్దది ఉన్నప్పుడు కొంచెం between the lines చదివే శ్రమ తగ్గిస్తే బావుండేదేమో అని నా అనుకొలు. అది ఎంత వరకూ నిజమో నాకు తెలియదు . పూర్తిగా bad idea కూడా అయ్యి ఉండొచ్చు అనుకోండి :-)))

    పొతే ఇది కథతో సంబంధం లేని అంశం లెండి . మనం ఏదన్నా, printed బుక్ , ఈ బుక్ ఇలాంటివి చదివేటప్పుడు పేజీలు చూస్తుంటే చివరకి వస్తున్నాం అన్న సూచన ఒకటి మెదడు కి ఆటోమాటిక్గా వెళుతుంది కదా దానితో prepared గా ఉండి అరె ఇదేంటి ఇలా అయిపోతుంది అన్నా అసంతృప్తి ఎక్కువ సార్లు ఉండదు అనుకుంటాను . ఇలా భాగాలుగా రాసేటప్పుడు ఏ మలుపు దగ్గర మీరు ఆగదలుచుకున్నారు/ ఆగుతుంది అనేది కొంచెం రాసేవాళ్ళకి, చదివేవాళ్ళకి సరిగా కమ్యూనికేట్ అవ్వకపోవటం అనేది ఆ అసంతృప్తి కి ఒక కారణం అనుకుంటా . చివర భాగాలకి వచ్చేటప్పుడు కొంచెం చదివేవాళ్ళకి హింట్ ఇస్తే ఆ అసంతృప్తి తగ్గుతుంది అనుకుంటాను :-)))

    చివరిగా నాకో క్రూరమైన ఐడియా వస్తుంది సీమ గురించి గుండె కరిగి నీరయ్యే లెవెల్లో మూల కథకి విరుద్ధమైన దిశలో వెళ్ళేట్లు గా ఒక విశ్లేషణ / వివరణో రాస్తే ఎలా ఉంటుందా అని :P (తిట్టకండి తిట్టకండి ప్లీజ్ ఊరికే ఆలోచన అన్నాను కదా :P ).

    సరేలెండి ఇక ఆపేస్తా లేకపోతే జనాలు నావెనక కర్ర పుచ్చుకుని రాగలరు :-))))

    ReplyDelete
    Replies
    1. -- పద్మా గారు అన్నది ఒక fictitious character మీద అభిమానం పెంచుకోవటం గురించి అని అనుకుంటున్నాను
      --------------------------------------------------------------------------------------------------

      Yes, Sravya. Exactly right. Nothing more than that.

      Delete
    2. @శ్రావ్యగారు
      నాకు మీ ఆలోచన కౄరంగా ఉన్నట్టు అస్సలు అనిపించట్లేదండీ! ఎవరైనా టీవీ సీరియల్ వాళ్ళు మీ ఆలోచన వింటే వెంటనే కొత్త సీరియల్ మొదలుపెడతారు :-)

      Delete
    3. @ శ్రావ్య, బిట్వీన్ ది లైన్స్ చదువుకునే శ్రమ తప్పించడం అనేది నా వల్ల కాదనుకుంటా. నా మీద చాలామందికి అతిపెద్ద కంప్లైంట్ అదే. :) పప్పు నాగరాజు గారు చెప్పినట్టూ అదే బలం, అదే బలహీనత కూడా. :) థాంక్స్ అగైన్. మీ క్రూరమైన ఆలోచన ప్రిడిక్టబుల్ కదా.. :)

      Delete
    4. శ్రీనివాస్ గారు ,

      :-) థాంక్ యు ! క్రూరమైన ఐడియా అయినా కాకపోయినా ఇది ఎప్పటి నుంచో అనంతంగా సాగుతున్న డిబేట్ కదా అలా చెయొచ్చా లేదా అన్నది . People are supposed have different opinions అనుకోండి, నావరకూ నేనైతే అసలు కథ విరుద్ధమైన దిశలో అలా విశ్లేషణ చేయటం cruel కాకపోయినా unethical అని బావిస్తాను . రాసింది ఏదైనా రచయిత / రచయిత్రి బ్రెయిన్ చైల్డ్ కదా , నచ్చితే ఎందుకు నచ్చిందో , నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పటం వరకూ న్యాయం గానీ , అసలు కథనే వేరేగా చూడమని చెప్పటానికి మనకేమి హక్కు ఉంది :-)))

      @ కొత్తావకాయ గారు ,
      భలే వారు అది మీ బలహీనత నా . తల్చుకుంటే మీకెంత సేపులే కానీ అది అధిగమించటం . ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది ఇది మీ స్టైల్ అంతే . హ హ predictable అంటారా , నో నో నేను ఒప్పుకోను .
      ఎనీవే, నేను అన్నది సరదాకి అని మీకూ తెలుసు అనుకోండి అయినా సరే గట్టిగా నొక్కి చెప్తున్నా అన్నమాట. పొతే క్షమించేయండి మీ సీరియల్ బా నచ్చిన సందర్భం లో చేస్తున్న అధిక ప్రసంగమే ఇదంతా :-)) One more time 'Thank you' for portraying such a nice story and congratulations.

      Delete
  8. మొత్తం మీద బావుందండీ :-)

    మీరు చాలా శ్రమపడి రీసెర్చ్ చేసి వ్రాసినట్టున్నారు - అంతరిక్షం గురించీ, స్కిజోఫ్రీనియా గురించీ. అసలు కధాంశం కూడా టైట్ రోప్ వాకే. మా దగ్గరి బంధువుల కుటుంబంలో ఇటీవలే స్కిజోఫ్రీనియా కేస్ ఒకటి చూసాను. మీరు వ్రాసిన వంశీ, సీమల సంభాషణలు చదువుతూ ఉంటే వారిదే కళ్ళకు కట్టినట్టు కనిపించింది. సీరియల్ వ్రాయటంలో ఇది మీ మొదటి ప్రయత్నం అనుకుంటాను, కానీ చదువుతున్నంతసేపూ ఎక్కడా అలా అనిపించలేదు. చాలా బాగా వ్రాసారు! కాకపోతే ఒక చిన్న మాట - 'గాలి సంకెళ్ళు ' అన్న పేరు వల్ల మొదటి 2-3 భాగాలు చదవగానే ముగింపు ఎలా ఉండబోతోందో కొంతవరకైనా ఊహించవచ్చనుకుంటాను. ఇదేమీ సస్పెన్స్ సీరియల్ కాదు కాబట్టి ఫర్వాలేదు కానీ ఒకసారి ఆలోచించి చూడండి.

    May be I am old fashioned, but ఈ లివ్-ఇన్ రిలేషన్షిప్ వెనక ఉండే పరమార్ధం నాకు పూర్తిగా అర్థం కాదు (మీ రచన అని కాదు, విడిగా కూడా). మహతిలాంటివారి గురించి నాదొక అనుమానం - వీరు భవిష్యత్తులో పిల్లల్ని కంటారా లేక ఏ అనాధశరణాలయానికో వెళ్ళి తమకు నచ్చిన లక్షణాలు ఉన్నాయనుకొన్న పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటారా? ప్రేమించడం, కొన్ని విషయాలలో సర్దుకుపోవడం అనేది పెళ్ళైనా పిల్లలైనా కామనే అయినప్పుడు చేసే విధానంలో ఈ తేడాలెందుకు? ఎవరో ముక్కూ మొహం తెలియని వాళ్ళని (లాటరీలా) పెళ్ళి చేసుకోవాలని అనను కానీ మరీ లివ్-ఇన్ వరకూ వెళ్ళటం అవసరమా అన్నది నా ప్రశ్న.

    వంశీ, గౌతమిల విషయంలో కూడా నాదో సందేహం - ప్రపంచందృష్టిలో వాళ్ళు చేసింది క్రైం, లేకపోతే వాళ్ళు అఫీషియల్గా ఎప్పటికి ఒకటి అవ్వగలుగుతారు వంటి విషయాలను ప్రక్కన పెడితే, వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నా వారికి భవిష్యత్తులో పుట్టే పిల్లలు మంచిగా వుండకపోవచ్చు కదా! గౌతమీ వాళ్ళ అమ్మకి స్కిజోఫ్రీనియా అని మీరు ఖచ్చితంగా వ్రాయలేదు కానీ మహతి మాటలని బట్టి చూస్తే అలానే ఉంది. పైగా అది వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువే, గౌతమి కి రాకపోయినా తన పిల్లలకి రాదని ఏమీ లేదు. కాబట్టి వంశీ వైపు నుంచి ఆలోచిస్తే పిల్లల దృష్ట్యా సీమకీ, గౌతమీకీ పెద్ద తేడా ఏమీ లేదు, కొంచెం రిస్క్ తక్కువ అంతే! ‘పిల్లల సంగతి తరువాత, ఇంటికి వచ్చి కాస్త ప్రశాంతంగా, మనసువిప్పి మాట్లాడుకోవటానికి తోడు ఒకరు ఉంటే చాలు’ అనుకుంటే అది వేరే విషయం :-)

    సర్లేండీ! నా అనుమానాలు, అభిప్రాయాలూ వ్రాసుకుంటూ పోతే ఇదే ఒక పెద్ద టపా అయ్యేట్టుంది. ఇంతటితో ఆపేస్తాను. But it was a good read! Thank you!

    ReplyDelete
    Replies
    1. కథ వెనుక కథో, పాత్రల విశ్లేషణలో రచయిత/త్రి సమర్ధనో - పాఠకుడి అనుభూతిని పలుచన చేస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయమండీ. కానీ చదివి స్పందించిన పాఠకుల సందేహనివృత్తో, స్పందనకి ప్రతిస్పందనో నా బాధ్యత కనుక వీలైనంతలో చెప్తా.. :)

      మీ అనుభవం దృష్ట్యా మీరు సీమ, వంశీల మధ్య సంభాషణనీ, సీమ అనే పాత్ర ఉనికినీ నమ్మారు. అలాగే గౌతమిని, మహతినీ కూడా చూసి ఉంటే వారి గురించీ ఎలాంటి ప్రశ్నలూ ఉండేవి కావేమో! చూసిందే నమ్ముతాం. కదా! :)

      ఇక మహతి విషయంలో.. "ప్రేమించడం, కొన్ని విషయాల్లో సర్దుకుపోవడమనేదీ కామనే అయినప్పుడు చేసే విధానంలో తేడాలెందుకు?" ఈ కథలో మహతి, గౌతమి కూడా తమ పూర్వానుభవాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకున్నారు. పెళ్ళి వలన వచ్చే న్యాయపరమైన బెనిఫిట్స్, కమిట్మెంట్ పై నమ్మకం లేక మహతి ఆ నిర్ణయం తీసుకుంది. నచ్చిన లక్షణాలు గల పిల్లలని కనడం అసాధ్యం.. అది మహతైనా, ఇటు వంశీ అయినా.. కానీ కేవలం పెళ్ళి అనే కట్టుబాటు వలన ఒరిగేదేముంటుందన్న వాదన మహతిదైతే, పిల్లలకి మెరుగైన పెంపకాన్ని అందించడంలో భాగస్వామి తోడ్పాటు. అదీ వంశీ సమస్య.

      వంశపారంపర్యత గురించి.. సీమకీ, గౌతమికీ పెద్దతేడా ఏమీ లేదు. నిజం. సీమ పిల్లలకి తన తన లక్షణాలను అందించడానికి ఎంత అవకాశం ఉందో, అందించకపోవడానికీ అంతే అవకాశం ఉంది. ఉదాహరణ: గౌతమి. :) ఇదే వాక్యాన్ని తిప్పి రాయొచ్చు గౌతమి విషయంలో.. :) కేవలం.. 'కలిసివచ్చే భాగస్వామిని ఎంచుకోవడమొక్కటే' మన చేతిలో ఉండేది. మీ ప్రశ్నలకి సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను. :)

      "గాలిసంకెళ్ళు" అన్న పేరు. ఉహూ.. అవి గాలిసంకెళ్ళే. :) మీ స్పందనకి ధన్యవాదాలు!

      Delete
    2. నేను 'సీరియల్ ' కి ఆ పేరు పెట్టటం మీద అనుమానం వ్యక్తం చేసాను కానీ 'కథ ' కి అదే సరైన పేరు....and అవి నిజంగా గాలి సంకెళ్ళే. no second thoughts about that!

      నా ప్రశ్నలు/అనుమానాలూ సీమ తరహా మనుష్యులను చూడటం వల్లా, గౌతమీ, మహతి లాంటి వారిని చూడకపోవటం వల్లా వచ్చినవి కావండీ! మా స్నేహితులలో ఒక జంట ఇలా లివ్-ఇన్ రిలేషన్షిప్ లోనే ఉన్నారు, నేను వాళ్ళని ఇదే ప్రశ్న అడిగాను కూడా! అఫ్ కోర్స్, వాళ్ళకి మహతి, గౌతమిలకున్న గతం లాంటిది ఏమీ లేదు. కేవలం కమిట్మెంట్, బాధ్యతలు అంటే భయపడి/బధ్ధకించి అలా కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారంతే.

      Thanks for your response! :-)

      Delete
  9. ఐపోతుందేమో అన్న అనుమానం లాస్ట్ ఎపిసోడ్ లో ఎప్పుడూ సరదాగా వుండే మహతి సీరియస్ గా మాట్లాడుతుంటే వచ్చిందండీ... అయినా ఇంత త్వరగా ఐపోతుందనుకోలేదు. అంతా బావుంది గానీ సీమ మీద ఎప్పుడూ కొంచెం కూడా సాఫ్ట్ కార్నర్ రాలేదు. మనుషుల్లో మంచీ చెడూ కోణాలుంటాయిగానీ, వొక మనిషి పూర్తిగా చెడుగానో మంచిగానో వుంటారంటారా?

    ReplyDelete
    Replies
    1. మంచీ, చెడూ రిలెటివ్ కదండీ. ఇదే కథ సీమ వైపు నుండి చెప్తే వంశీ పై సాఫ్ట్ కార్నర్ ఉంటుందా? :) మంచీ చెడూ అని కాకుండా ప్రవర్తన, యాటిట్యూడ్ ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటే సీమలాంటి వారు ఉంటారు. ధన్యవాదాలు! :)

      Delete
  10. ముగించేశారన్న మాట!!
    ప్రతి నెలా చదివించారు.. తరువాతి భాగం కోసం ఎదురు చూసేలా చేశారు. చాలామంది పాఠకులకి అంతగా పరిచయం లేని అంశాలని ( అంతరిక్షం వగయిరా ) విశదంగా రాశారు.. సీరియల్/నవల చదివే పాఠకులు ప్రధాన పాత్రలతో పాటు ప్రయాణం చేస్తారు. కథతో పాటుగా ప్రధాన పాత్రలు అన్నింటికీ ముగింపుని ఆశిస్తారు.. ఇది చాలా సహజం. 'గాలి సంకెళ్ళు' విషయానికి వచ్చేసరికి, 'సీమ' ఏమయ్యింది? అన్న ప్రశ్న అలాగే మిగిలిపోయింది.. సీమని కేంద్రంగా తీసుకుని కొనసాగింపు (మరో సీరియల్) రాసే ఉద్దేశం ఉందేమో అనిపించింది నాకు :)
    విజయవంతంగా మొదటి సీరియల్ పూర్తిచేసినందుకు అభినందనలండీ!

    ReplyDelete
    Replies
    1. మీ ఆదరానికి ధన్యవాదాలు.

      @ 'కథలో ప్రధాన పాత్రలన్నింటికీ ముగింపు కోరుకోవడం.' నిజం. అప్పుడు సీమ పాత్రకి బలవంతమైన / నాటకీయమైన ముగింపు ఇవ్వాల్సి వచ్చేదేమో. అయినా నేను చెప్పడం అయిపోయిందేమో కానీ కథ అయిపోలేదు కదండీ. :) ఒక మలుపు దగ్గర నా narration ఆపేశానంతే.

      Delete