Sunday, June 1, 2014

"గాలిసంకెళ్ళు" నవలిక

"జీవించినందుకు రెండే ఫలితాలు. తీవ్రమైన ప్రేమతో జీవితం వెలగాలి. లేకపోతే విరహంతో కాలిపోవాలి. అంతేకాని ధనము, సుఖము, భోజనము.. ఇవన్నీ కలిగి బతకడం యెందుకు!"

అంటాడు.. రగిలే ప్రేమికుడొకడు. ప్రేమ ఉండి.. ధనము, సుఖము... భోజనమూ లేకుండా 'బతకడం' సాధ్యమేనా? అని అడిగితే మల్లెల నవ్వొకటి విసిరి మౌనంలోకి జారిపోతాడేమో.

"ప్రేమలేఖలు" చదివిననాటి నుండీ.. ఇంత ప్రేమ సాధ్యమా అనే ఆలోచన. సాధ్యమే అయితే "ఏదీ..??" అనే అన్వేషణ. అసాధ్యమేమోనని అనుమానం ఎప్పుడూ లేదు. చలం ఇచ్చిన భరోసా?? అయితే, లౌకికమైన జీవన వ్యాపారాలలో లోటు కలిగితేనో, లోపలెక్కడో దెబ్బ తగిలితేనో తప్ప, పరుగుల్లో కోల్పోతున్నదేవిటా అని వెనక్కి తిరిగి ఆముష్మికమైన ప్రేమ గురించి చింతన మొదలెట్టం. మనలో మూడువంతుల ముప్పాతిక శాతం మందిమి..  పిల్లి మెళ్ళో గంట కట్టేందుకు వెనకాడి, జీవితాలు నెట్టేస్తాం. ప్రేమ ఆముష్మికమే ఎందుకవ్వాలి?

"గూట్లోంచి ఉదయం పాకుతోంది కానీ.. నాకేం సంతోషం?" అని కల్మషం లేకుండా మనసులో, కౌగిలిలో, దినచర్యలో... కలుక్కుమనే ఆ వెలితి అనుభవించి రగిలిపోవడం, కనుపట్టిన దారిలో ముళ్ళు తొలిగించుకుంటూ సాగిపోవడం ఎందరికి చేతనవుతుంది?

ఈ ప్రశ్నల్లోంచి పుట్టిన కథ "గాలిసంకెళ్ళు" 


ఇప్పుడు "గాలిసంకెళ్ళు" కౌముది గ్రంథాలయంలో గుత్తంగా...

7 comments:

  1. హార్థికాభిన౦దనలు. నేను కొన్ని బ్రేకులు రావడ౦ తో, కౌముది లో చదవలేక పోయాను.
    ఇక ఒకేసారి అ౦తా చదివేస్తాను.

    ReplyDelete
  2. కృష్ణ ప్రియ గారి మాటే నాదీనూ! మొత్తం ఎపిసోడ్స్ చదవలేదు. మొత్తం చదువుతాను ఒకేసారి. అసలు అలాగే నాకు ఇష్టం కూడా!

    కొత్త అట్టేసుకుని గ్రంధాలయంలో చేరినందుకు మీ నవలకు,మీకూ అభినందనలు

    ReplyDelete
  3. అభినందనలు.నేనూ పూర్తిగా చదవలేదు. ఇప్పుడు చదువుతాను.

    ReplyDelete
  4. i just love this novel..read it in Koumudi. manasuku daggaraga anipinchina story..enni sarlu chadivano...antha bagundi. i appreciate you. afterlong time..i searched for your stories..got here...thank you so much.

    ReplyDelete