Wednesday, May 11, 2011

లంచ్ బాక్స్ లో ప్రేమలేఖ

నువ్వేదో అందని చందమామవని కాదు.
నేను దక్కని ఎండమావిననీ కాదు.
నేనూ..నువ్వూ, బ్యూటీ అండ్ బీస్ట్ కానే కాదు.
నా దారిలో పున్నాగలు పరవకపోయినా..,
జేబులోంచి ఉంగరం "ట డా.." అని తీయకపోయినా,
చెట్టంత నువ్వు, పొట్టిగా ఉన్న నా ఎదుట
ఆకాశం వంగినట్టు , ఒక్కసారి వంగితే
నీ సొమ్మేం పోయేదోయ్?
ఆ క్షణం నా చరిత్రలో
నేనొక ఏడు మల్లెలెత్తు రాకుమారిని అయ్యేదాన్నిగా..!
అప్పుడప్పుడూ నా వంటలో ఉప్పెక్కువయ్యేది కాదుగా!

12 comments:

  1. మూడు మగ నవ్వుల తరువాత , ఒక ఆడ నవ్వు. హహ్హాహ్హా

    ధన్యోస్మి.

    ReplyDelete
  2. ఆకాశం ఒకమాటు వంగితే
    వంటలో ఉప్పే ఉండేది కాదేమో

    :):)

    ReplyDelete
  3. @ బులుసు వారు
    అంత అదృష్టం కూడానా? [ఇది నా ఊత వాక్యం. :)]

    నిజంగా అకాశం వంగిఉంటే ఉప్పు, ఊరగాయలేం ఖర్మ! బొబ్బట్లు బ్రేక్ ఫాస్టు, లడ్లు లంచ్, జిలేబీ చిరుతిండి, పాయసం డిన్నరూను. దేనికైనా దంత సిరి ఉండాలి! ఏమంటారు?

    ReplyDelete
  4. >>అప్పుడప్పుడూ నా వంటలో ఉప్పెక్కువయ్యేది కాదుగా!
    చివరి లైన్‌ లో భలే చమత్కారాన్ని కలిపారు. :)

    ReplyDelete
  5. @ మురారి గారు,

    థాంక్స్. :)

    ReplyDelete
  6. మీరు వ్రాసేవి చదివిన వెంటనే అనుభూతుల్లో పడిపోతాం. కామెంటు వ్రాసి సరిపుచ్చి మరొక బ్లాగుకి వెళ్ళిపోదాం అంటే కుదరదు.

    ReplyDelete
  7. మురళి గారూ సరిగ్గా చెప్పారు.ఏదీ ఈ ఒక్క పోస్టు చూసెడదా౦ అని కాఫీకి పొయ్యి మీద పాలెట్టి ఇలా మొదలెట్టనా? పాలు కాస్తా కోవా అయ్యేట్టుంది .

    ReplyDelete
  8. సూపరండి బాబు :D

    ఇందాకటి నుంచీ మా వారు " టీ పెట్టూ .." అంటున్నారు .... నేను: మీ బ్లాగు చదువుతూనే వున్నాను.... :D

    ఇవాళ నవ్వీ నవ్వీ నా ఆయుష్షు ఒక 1000 సంవత్సరాలు పెరిగిపోతుందేమో !

    ReplyDelete