అప్పుడే శుభాకాంక్షలు చెప్పెయ్యకండి. అబ్బే.. ఇంకా రాలేదండి. 'ఇహనో, ఇప్పుడో వచ్చేస్తుందేమో!' అని నాకు అనుమానం. ఎందుకంటారా! జీళ్ళు తినడానికి సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకునే బాపతు కదా నేను. గిన్నెడు పాయసం వండుకొని, పెద్ద ఇత్తడి పళ్ళెం నిండా మైసూర్ పాక్ పోసి, మా నాన్నగారికి ఓ ఫోన్ కాల్ చేసేసి "ఫాదర్స్ డే" జరిపేసుకోవాలని నిర్ణయించుకున్నాను. "మరి ఆయనకి ఏమిస్తే బాగుంటుందా!" అని ఆలోచిస్తే ఆయన ప్రపంచానికి చేసిన సేవలకి "నోబెల్ శాంతి బహుమతి" కి తక్కువదేదీ సరిపోదనిపించింది. వినరా నాయనమ్మ వీర కుమారుని విజయగాథ నేడూ!
అది కొన్ని దశాబ్దాల క్రితం నేను పుట్టిన రోజు. ఆరునొక్క రాగంలో ఆలాపన అందుకున్న నన్ను ఊరుకోబెట్టడం ఎవరి తరం కావట్లేదట. తపస్సులో కూర్చొని కూర్చొని కాళ్ళు తిమ్మిరెక్కి, హిమాలయాల నుండి విశాఖ తీరానికి వ్యాహ్యాళి కి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ చిదంబరానంద స్వామి వారు ఆ వైపుగా వెళుతూ, నా రాగానికి ముగ్ఢులై మా ఇంట్లోకి విచ్చేసారట.
"సమయానికి అరుదెంచారు మహానుభావులు. మా పిల్ల కచ్చేరీ వినలేక ఊరంతా గగ్గోలు పెడుతోంది. ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోమని" వారిని వేడుకున్నారట మా తండ్రి గారు. నా హావభావాలు, ఏడుపులో స్థాయీ బేధాలను స్వామి వారు గడ్డం గోక్కుంటూ గమనించి, తన సూక్ష్మబుధ్ధికి తట్టిన తరుణోపాయం సెలవిచ్చారట. "నాయనా! పిల్ల ఏడుపుకి కారణం పొట్ట ఉబ్బరమో, పాలు సరిపోకో కాదు. ఈ శిశువు సామాన్య శిశువు కాదు. మీ పిల్ల పెద్దయి సాధించాల్సిన రాచకార్యాలు చాలా ఉన్నాయి. మీరు చూస్తే ఇంత మెతకవారిలా కనిపిస్తున్నారు. మరి పిల్లది అఖండ కీర్తిని ఆర్జించే క్రమంలో పెట్టే రాటు పోట్లకు తట్టుకోగలరా!" "అయ్యో ఎంతమాట! తొలిచూలు ఆడపిల్ల. మహాలక్ష్మి. అందునా గొప్ప కీర్తిని ఆర్జిస్తుందని చెప్తున్నారు. దేనికైనా సిధ్ధమే స్వామీ!" అని కమిటైపోయారట నాన్నగారు. "సరే! జాగ్రత్తగా విను కుటుంబరావ్. మీ పిల్ల కి ఉత్సాహం పాళ్ళు ఎక్కువ. "రేపేం జరుగుతుందా!" అనే ఆలోచన బహు మెండు. "బాలసారెలో ఏం పేరు తగిలిస్తార్రా నాయనోయ్!" అని శిశుభాషలో ఆలోచించుకుంటోంది. అంతే!" అని సెలవిచ్చారట స్వాముల వారు. బుర్ర గోక్కుంటూ ," ఇప్పటికేం అనుకోలేదు కానీ, స్వామీ! తప్పకుండా మంచి పేరే పెడతాం. పదిరోజులు ఆగలేదా!" అని ఆశ్చర్య పోయారట నాన్నగారు. "అబ్బే, లేడికి లేచిందే పరుగు. కళ్ళంలోనే కందులు వేయించేస్తుంది మీ కుమారీ మణి. మీరు ఉన్నఫళాన పిల్ల తృప్తి పడి తలాడించే పేరు ఆలోచించి, దాని చెవిన వేసి ఆమోద ముద్ర వేయించుకుంటే తప్పితే ఏడుపు ఆపదు. ఇది మొదలు మాత్రమే! ఆల్ ద వెరీ బెస్టోయ్!" అనిచెప్పి చక్కా వెళ్ళిపోయారట.
అలా మొదలైన పరీక్షలు మా తండ్రి గారి సహనాన్ని రికార్డు స్థాయిలో పెంచుకుంటూ వచ్చాయి. అది మొదలు ప్రతి రోజూ నాకొచ్చే రకరకాల ప్రశ్నలకు, సరైన సమాధానమో, మార్గమో వెతికే వరకూ నిద్ర పోనిచ్చేదాన్ని కాదట. "పిల్ల బుగ్గలు బూరెల్లా ఉన్నాయ్ రా!" అని మా నాయనమ్మ నన్ను చూసి ముద్దులాడిందిట. బూరెలెలా ఉంటాయో రుచి చూపించే దాకా సంగీత సాధన చేసానట. ఇలా పాల సీసా మొదలు, పట్టు పరికిణీల వరకూ నేను వేసిన ప్రతి అడుగు వెనకా మా నాన్నగారి సహనం ఎంతైనా ఉంది. అర్ధ రాత్రనక అపరాత్రనక నాతో పాట్లు పడలేక నన్ను, మా నాన్నగారిని శాశ్వతం గా ఆరుబయటికి నెట్టేసారట ఇంట్లోవాళ్ళు. పదే పదే నాకు రేకెత్తే ప్రశ్నలకు నిద్రలేచే మా నాన్నగారు, పనిలో పనిగా వీధిలో దొంగలబెడదని నివారించే రక్షకభటుడయి అందరి మన్ననలు అందుకున్నారట.
కత్తిరిస్తే, అవి నేను చింతపిక్కలు, ఏడుపెంకులు ఆడుకొనే రోజులు. పందెం వేసుకున్న బెల్లం, శెనగపప్పు ఎగ్గొట్టిందని వనజని ఇదిగో.. ఇలా ఓ చిన్న కంకర రాయి విసిరి దండించానంతే! ఆ పిల్లకి క్రీడా స్పూర్తి బొత్తిగా లేదనుకోండి. బొటబొటా కన్నీరు చిందించి పంచాయితీ పెట్టించేసింది. అప్పటి నుంచి నా తోటి బాల బాలికల సంక్షేమార్ధం, నన్ను ఇల్లు విడిచి ఆటలకు పంపించేది లేదని మా తండ్రి గారి చేత అష్ట దిక్పాలకుల మీదా, ఆరు ఋతువుల మీద ప్రమాణం చేయించుకున్నారు పుర ప్రజలు. ఏం తోచక ఇంటిల్లి పాది గోళ్ళూ కొరికేస్తున్న నాకు, మనోల్లాసం కలిగించే నిమిత్తం చందమామ, బాలమిత్ర, ఆంధ్ర భూమి, యుగంధర్ పరాక్రమ చంద్రిక ఇత్యాది పుస్తకాలు కొనితెచ్చి, సాహిత్య సర్వస్వాన్ని నేను ఆకళింపు చేసుకొనే సదుపాయం కలిగించారు. చూసారా! భావి తరానికి నాలాంటి రచయిత్రిని అందించడానికి ఆయన అక్కడే పునాది రాయి వేసారన్నమాట.
మా తండ్రి గారికి విద్యా శాఖ వారి కచ్చేరీలో పని. అది దేశ సంక్షేమానికి ఎలా ఉపయోగపడిందో చెప్తాను వినండి.
"అమ్మాయీ, పన్నెండో ఎక్కం రాసావా!"
"పక్కమ్మాయి చేత రాయించారు కదా,మాస్టారూ! నేనూ రాస్తే మీకు విసుగు రాదూ! "
"ఉపకారికినుపకారము పద్యం చెప్పు, తల్లీ!"
"ఉపకారమా.. మామిడి ముక్కల్లో నంచుకుంటే బాగుంటుందేమో కదండీ"
నీకు నచ్చిన పండగ గురించి వ్యాసం రాసావా?
"ఓ.. నా పుట్టినరోజు పండగ గురించి రాసానండీ"
ఏదీ పాడమ్మా.."వరవీణా.. మృదుపాణీ.."
కవల పిల్లలాండీ వీళ్ళు.. తేనె మనసులు సినిమాలో కుట్టి పద్మిని లాగా!
ఇలా వారి వారి ప్రాణాలు విసిగి పోయేవరకు నా మేధస్సుకు పదును పెట్టిన మాస్టార్లని, వీలున్నప్పుడల్లా బదిలీ చేయించి, వారిని, వారి కుటుంబాలను కాపాడారు మా తండ్రి గారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కంటే ఈ బదిలీ బహు గొప్పదని వారందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు కూడాను.
త్రికోణమితి సమాధాన పత్రం నిండా రంగు రంగుల ముక్కోణాలు గీసి ఇచ్చిన నా ప్రతిభకు మెచ్చి, ఇంటర్మిడియట్ బోర్డువారు నన్ను రాజలాంఛనాలతో డిగ్రీ కాలేజీ కి పంపించి చేతులు దులిపేసుకున్నారు. అందరు ఆడపిల్లల్లాగే కళ్ళనిండా కోటి ఆశలతో కాలేజీలో అడుగుపెట్టాను. కాలేజీ ఎదురుగా ఉన్న చెరుకు రసం అమ్మేవాడిని, కొబ్బరిపువ్వు, తేగలు, మొక్క జొన్న పొత్తులు అమ్మే వారిని ఇతోధికం గా పోషిస్తూ, రిలీజయిన సినిమా అయినట్టుగా చూసేస్తూ మూడేళ్ళు ముచ్చటగా గడిపేసాను. నన్ను అలరించే మిత్ర బృందం పుణ్యమా అని ఓ మూడేళ్ళు మా నాన్నగారికి తాత్కాలిక ఉపశమనం కలిగించాను. ముందుంది గా మరి ముసళ్ళ పండగ!
అవి మండువేసవి సెలవులు. మామిడిపళ్ళు, కొత్తావకాయతో జీవితం అనిభవించేస్తున్న నాకు పెళ్ళి చేసెయ్యాలని సంకల్పించారు మా మాతాపితరులు. కానీ నా వినయవిధేయతలు తెలిసినవారు కనుక , వారు కొంచెం చింతాక్రాంతులై ఉండగా మా పితృదేవుల కలలోకి, నేనంటే అమితమైన మక్కువ గలిగిన మా పితామహులు (పరమపదవాసి) కనిపించారట.
"ఏమిటి రామయ్యా, దీర్ఘం గా ఆలోచిస్తున్నావు?"
"ఏం లేదు, ఇంటికీ గొడ్ల సావిడికీ బేరం కుదిరితే కానీ మీ మనుమరాలికి పెళ్ళి చెయ్యగలిగేలా లేను."
"అయ్యో, వెర్రి నాగన్నా! మన వంశపారంపర్య "గేలం" గురించి ఈ సమయానికి నీకు గుర్తుచెయ్యమని మీ అమ్మ కి చెప్పానే! సర్లే, టీవీ సీరియళ్ళలో పడి మర్చిపోయి ఉంటుంది. ఖర్చు లేకుండా అల్లుణ్ణి వెతికి పట్టుకొనే అద్భుత శక్తి గల గేలం మన పూర్వీకుల నుంచి సంక్రమించింది నాయనా. నీకు దిగులు వలదు. పూర్వం సత్రాజిత్తు తన కుమార్తె సత్య భామకి వరుణ్ణి వెతికే నిమిత్తం ఈ గేలం తయారు చేయించాడు. గేలానికి శమంతక మణి ఎరవేసి వదిలితే శ్రీకృష్ణుడు తగిలాడు. శమంతక మణిని మన సత్యభామ "పూజ చేస్కుంటాను. ఇవ్వవోయ్!" అని వెనక్కి తీసేసుకుంది. కృష్ణుడు లాభం. "
"మరి శమంతక మణి నాకెక్కడిది, నాన్నగారూ!"
"అయ్యో తండ్రి, తరాలు గడుస్తున్న కొద్దీ మణులు కరిగి అమ్మాయీ మణులే మిగిలారు. సిరి ఉట్టిపడే విలక్షణమైన ముఖ పద్మాలు మనింటి ఆడపిల్లల సొత్తు. నువ్వేం బెంగడిల్లకు. వ్యవస్థ దాని పని అది చేసుకుపోతుంది. గేలం దింపించి చూడు."
"సరే కానీ, మీ మనుమరాలి సంగతి తెల్సిందే కదా! దీన్ని భరించే భర్త పుట్టాడా.. అని."
"ఓయీ రామానుజం! నీకో పిట్ట కథ చెప్తా...శంక మాని శ్రధ్ధగా విను.
కుశ ధ్వజుడనే రాజుగారికి రేవతి అని ఓ చక్కని పిల్ల ఉండేది. వయసుతో పాటు ఆ పిల్ల పొడవు కూడా ఎదుగుతూ వచ్చింది. వయసు, పొడవుతో పాటు రేవతికి, ఛాయాదేవికి ఉన్నంత ముట్టె పొగరు, సూర్యకాంతానికి ఉన్న వాచాలత, నీ కూతురికి ఉన్నంత అత్యుత్సాహం, దుంప తెంపి ధూపమేసే గుణం ఉన్నాయి. రోజు రోజుకీ పొడవు తో పాటూ ఇవన్నీ పెరుగుతూ ఉంటే రాజు గారు నీలాగే బెంగతో కుంగి కుదేలయ్యేవారట. అలా ఎదిగి ఎదిగి ఆ పిల్ల ఇంటి చూర్లని, తాటి చెట్లని దాటి ఆకాశం దాకా ఎదగ సాగిందట. స్వయంవరం సంగతి దేముడెరుగు. అసలు ఆ అమ్మాయిని కళ్ళలో కళ్ళు పెట్టి చూసే మగాడెవడని? అప్పుడు ఆపధ్బాంధవుడిలా వచ్చాడట బలరాముడు. "మీ పిల్లను వంచుతాను. నచ్చితే పెళ్ళాడతాను" అని అభయం ఇచ్చాడట. నాగటి కొన ఆ పిల్ల నెత్తిన పెట్టి శక్తి మేరా కిందకి లాగి తనతో సమానంగా చేసుకున్నాడట. ఇంక చెప్పేదేముంది. "వంగెననంగుని చాపము, వంగెను బాలేందుధరుడు, వంగెను శైలరాణ్ణందన.. పూలందుకొనుడంచు సుమనోంజలి జాచి.."అన్నట్టు పిల్ల వంగింది. పెళ్ళీ అయింది. కాబట్టి నాయనా! పిల్లంటూ పుట్టాక అల్లుడు దొరకడా.. ఆల్ ద బెస్ట్!" అనేసి అంతర్ధానమైపోయారట.
కొత్త ఉత్సాహం తెచ్చుకొని మా తండ్రిగారు నాకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేసారు.
(ఈ మాత్రానికి నోబెల్ బహుమతి ఇచ్చేస్తారటండీ ఎవరైనా! ఇంకా చాలా ఉంది. తరువాయి భాగం అతి త్వరలో!)

నాకు మీ తెలుగు బాగా నచ్చుతుంది!! స్వచ్చంగా....చాలా బాగుంటుంది :)
ReplyDeleteటపా ఎప్పటిలాగే అద్భుతం :)
Chaalaa baagaa raasaarandeee, chakkagaa flow ayyindi. Excellent narration. Keep posting!
ReplyDelete@ ఇందు గారు,
ReplyDeleteఒక తెలుగు బ్లాగర్ కి ఇంతకంటే మంచి అభినందన ఏముంటుంది? చాలా సంతోషం. ధన్యవాదాలు. :)
@ అనానిమస్ గారు,
సంతోషం. ధన్యవాదాలు. తప్పకుండా! :)
Haiiiiiiiiiii! first comment naade ;) naade ;)
ReplyDeleteమీ రచనా శైలి చాలా బావుంది.టపా కూడా చాలా సరదాగా పెదాలపై నవ్వులు పూయించేలా ఉంది
ReplyDeleteI have taken your post to Sankalanam
ReplyDeletegreat articler
ReplyDeleteమిగిలిన భాగం చదవకుండానే మీ నాన్న గారి నోబెల్ శాంతి బహుమతి కి మద్దతు కూడా ప్రకటించేస్తున్నా :))
ReplyDelete>>> నన్నడిగితే ఉప్పెంతో కారం అంత, కారం ఎంతో ఆవపిండి అంత,అవన్నీ ఎంతో నూనె అంత. ఆవకాయంటే ఇంతే..
ReplyDeleteకొత్తావకాయ అంటే ఇదే. కొంచెం కమ్మగా, కొంచెం కారంగా, అంటియంట నట్టుగా పుల్లగా, మొత్తం మీద నోట్లో నీరూరించే టట్టుగా. శైలి, కధనం, భాష , మీ ట్రేడు మార్కు హాస్యం లో గొప్పగా కుదిరాయి.
చాలా బాగుందండీ. నిజంగా... చాలా చాలా బాగుంది :)
ReplyDeleteఎంత మంచి బాషండీ మీది! ఎంతకీ మొహం మొత్తదే! :-) మీరు చెప్పే సంగతులు కూడా అంతే మధురంగా ఉన్నాయ్! బాగా రాశారు..
ReplyDeleteమీ శైలి చాలా బావుంది :)
ReplyDeleteమరి మీ నాన్నగారికి నోబుల్ శాంతి ప్రైజ్ ఇచ్చేయండి :)
ReplyDeletehappy fathers day .
భలే నవ్వించింది మీ టపా.. హాస్యం అందరూ రాయలేరు. మీ శైలి బాగుంది. ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నా మీ బ్లాగ్ ని.
ReplyDeleteబ్రహ్మాండంగా ఉంది !!
ReplyDeleteచాలా బాగుంది. ఈ మధ్యకాలంలో బ్లాగుల్లో ఇంత మంచి హాస్యం కరువయ్యింది. ఆ లోటుని భర్తీ చెయ్యండి.
ReplyDelete@ బెల్లం కొండ లోకేష్ శ్రీకాంత్ గారు,
ReplyDeleteధన్యవాదాలు. కొత్తావకాయకి స్వాగతం.
@ జాన్ హైడ్ కనుమూరి గారు,
ధన్యవాదాలు.
@ lakshman
thank you vey much.
@ శ్రావ్య గారు,
ReplyDeleteమలి భాగం చదివి మద్దతు వెనక్కి తీసుకోనంటే చాలు.:)
మీ మద్దతుకీ, వ్యాఖ్యకీ ధన్యవాదాలు.
@ బులుసు సుబ్రహ్మణ్యం గారు,
ధన్యురాలిని. నా బ్లాగు పేరు సార్ధకం అయిందంటే అంతకంటే నాకు కావలిసినదేముంది. హాస్యం పండించడంలో 'భీష్మాచార్యులు' మిమ్మల్ని మెప్పించగలిగానంటే, ఈ పిల్లకాకి ప్రయత్నం ఫలించినట్టే. ధన్యవాదాలు. :)
@ అయినవోలు ప్రణవ్ గారు,
ReplyDeleteచాలా సంతొషమండీ. ధన్యవాదాలు. కొత్తావకాయకి స్వాగతం.
@ గోపాల్ గారు,
మీ వ్యాఖ్య చదివి ఎంత సంబర పడ్డానో, అంత భయపడ్డాను. భాష విషయంలో ఎంత జాగ్రత్తగా రాయాలో ఇక ముందు అని. మీరు అందించిన ప్రోత్సాహం నిలబెట్టుకోనే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. కొత్తావకాయకి స్వాగతం.
@ హరే కృష్ణ గారు,
చాలా సంతోషం. ధన్యవాదాలండీ.
@ మాలా కుమార్ గారు,
ReplyDeleteఅప్పుడేనా! మలి భాగం రాసి మీఅందరి ఏకగ్రీవ నిర్ణయంతో బహుమతి ప్రదానం చేద్దామనుకున్నానే మరి! ధన్యవాదాలు. నా బ్లాగ్ కి స్వాగతం.
@ మురారి గారు,
ధన్యవాదాలు. కొత్తావకాయకి స్వాగతం. నేనూ మీ బ్లాగు ఇంతకు మునుపు చూడలేదు. నేను నవ్విస్తే మీరు ఏడిపించారు నన్ను. అద్భుతమైన కథకుడిని కలుసుకున్నందుకు సంతోషం గా ఉంది. :)
@ (హరే ఫలా) ఫణి బాబు గారు,
ReplyDeleteకొత్తావకాయ కి స్వాగతం. చాలా సంతోషం. ధన్యవాదాలు.
@ మురళి గారు,
అయ్యో ఎంతమాట! హేమాహేమీలున్నారండీ బ్లాగ్లోకంలో! మీ అభిమానానికి కృతజ్ఞతలు. చాలా సంతోషం.
సూపర్ సూపర్...మీ నాన్నగారికి నోబెల్ బహుమతి ఏం ఖర్మ ఇంకా అంతకన్న పెద్దదేదో ఇవ్వాలి. నీ సగతి ఎఱుకున్నదాన్ని...మీ పితృపాదులు మూర్తీభవించిన శాంతంలా కనిపిస్తుంటారు నాకు...నిన్ను చిరునవ్వుతో సహించారంటే నోబెల్ ఎందుకూ పనికిరాదు సుమీ.
ReplyDeleteటపా మాత్రం బ్రహ్మాందంగా పేలిది.
ఆ సౌమ్యా, నోబెల్ని మించింది నీ సానుభూతి. హ్హహ్హహ్హా.. థాంక్స్ పిల్లా..!
ReplyDeleteI am waiting for the gold moment ........ nee naannagaru raamanujam
ReplyDeleteకొత్తావకాయ్ గారూ!
ReplyDeleteఈ పేరేంటో విచిత్రం గా వుంది. పోన్లెండి అలాగే పిలిచేసుకుందాం. మీ లాంటి ఆడాళ్ళంతా ఈల వేసే ఘనుడిని కట్టుకోవాలని అనుకుంటే ఎట్టాగండీ. అదేదో నాకు రాదనీ మా ఆవిడే నా బామ్మర్డులతో పోటీపడి కయ్య్ కయ్య్ మని చెవులు వూదరగోడుతుంది. అందుకని నాకు రాకపోయినా తన ఈల తనే వేసుకుంటుంది. రేడియో తో పోటీ పడి సినిమా పాటలు కూడా పాడేస్తుంది. ఆ పోలికే మా పిల్లలకి కూడా వచ్చింది. పోన్లెండి! వాళ్ళ పెళ్ళాలు సంతోషిస్తారు ???
మీ మాయాబజారోపాఖ్యానం అదరహో అదరహ. మా ఆవిడకి తప్పకుండా ఈ టపా చూపించాలని అనుకుంటున్నాను. నా బంతిపూలు బ్లాగు కూడా సందర్సించగలరు.
సూపరో..సూపరు.. అద్భుతం గా ఉందండీ..
ReplyDeleteఇదిగో.. ఈ కింది లైన్ ని నేను విరివిగా వాడేస్కుందాం అనుకుంటూన్నా.. నాకు చాలా నచ్చేసిందండీ..
"దుంప తెంపి ధూపమేసే గుణం" వి.టా.హా
:D
ReplyDelete