బావూఁ.. నన్ను అప్పలనరసంతారు. మా ఇంటోడు "నరిసీ.." అనీవోడు. అదురుట్టమంతుడు.. నా ఒల్లోనే మారాజునాగా సుకంగా ఎల్లిపోనాడు.
ఇయ్యాలేటో మనేద. కాలూ సెయ్యీ ఆడట్నేదు. ముగుణ్ణి కొట్టీసి మొగసేలకెక్కినాదట ఎనకటికొకత్తి! అట్టాగుంది నా పని. అవితే ఈడ నా తప్పేవీఁ నేదనుకోండీ.. న్నాయవోఁ అన్నాయవోఁ తవఁరే సెప్పాలి మరి.
యేటయినాదంటే.. నాకో గుంతడున్నాడు. గుంతడంటే సిన్నోడూ సితకోడూ యేటి కాదు. మొన్న దీపాలమాసె కి పాతికేల్లు ఎలిపొచ్చాయాడికి. బేంకీలో ఎటెండ్రు. బానే సంపాదిత్తన్నాడు. మనువూ సేస్సాం. ఆడి అయ్య పోయిన యేన్నర్దానికి మా సుట్టాలోల పిల్లే సాయిత్తిరి, దాన్నిత్తావఁని అడిగీ.. నాలుగు తులాల బంగారవూఁ, అయిదేలు రొక్కవూఁ ఇచ్చి ముడెట్టారు. ఆ సాయిత్తిరి, నా కోడలు.. అది సూత్తూండగా.. దాని కోసరవేఁ ఆడిని, నా కొడుకుని సాచి నెంపకాయ కొట్టీసినాను. నా సేతులొడిపోనూ.. ఆకాడినుంచీ మనేద. కడుపులో బాద. గుండిల్లో నొస్తాంది.
"పెల్లాం ముందు సెట్టంత కొడుకుని.. ఆడినెందుకు కొట్టీసినావే అప్పల్నరసా..?" అని తవఁరడుగుతారేటో.. ముందు సేనా పేద్ద కత సెప్పాల. అది ఇనుకుంతే నా కోపవూఁ అదీ అరదమవుతాది.
తగరపొలసలో మా సుట్టాలు.. మా పెద బాప్పకి యీరకత్తెకి సెల్లెలు ఉండీటిది. సూరప్ప అంతారు. ఆ సూరప్పకి కావెఁర్లొచ్చి సచ్చిపోతే.. సూరప్ప పెనివిటి పైడ్రాజు ఆరేల్ల పసిదాయిని తీసుకుని మా ఊరొచ్చీసినాడు. దాని పేరు "మజ్జి గవురి". గవురమ్మ తల్లి పెసాదవుఁ! లక్క పిడతనాగ ఉండీది. పైడ్రాజు సిన్నాన్న మనుసు సిక్కబెట్టుకునే దాకా మాయమ్మే గవురిని సాకీటిది. జడలేసీది, గుడ్డలుతికీది, కలో గంజో మాతో కలిపి పోసీది. నాకో ఎనిమిదేల్లుంతాయేవోఁ ఆకాడికి. నానూ, గవురీ కలిసి ఆడుకునేటోల్లం.
"ఊరందరికీ సోది సెప్పీ సిలక తన జాతకవెఁరగదన్న" సావెఁత మా పైడ్రాజు సిన్నాన్న బతుకులో నిజవు. అతగానేవోఁ పేద్ద వొయిజ్జుడు. తన పెల్లాం రోగం కానుకుని, కుదురుసుకోలేకపోనాడు. "కరమ! నా ఇంటిదాయికి నూకలు సెల్లిపోనాయ్" అనీటోడు. కొండల్లో తుప్పల్లో మూలికిలు తెంపుకొచ్చి ముద్ద నూరేటోడు. మిడతల్ని కాల్సీసి బసుమం సేసేటోడు. వానపావుఁ కొట్టు కాడ్నుంచి యేటేటో దినుసులు తెచ్చి మందులు తయారు సేసీవోడు. దినుసులూ అయ్యీ యేసి నూని మరక్కాచి కాలు నొచ్చినా, సెయి నొచ్చినా దిగరాసి కాపడం పెట్టీవోడు. యేటి ఒండ్రు తెచ్చి పట్లు యేసీటోడు. యెన్నెల రేతిరిల్లో తాసుపావుఁలు పట్టీవోడు! కోరలు పీకీసి మల్లీ ఒగ్గీసీవోడు. ఆ యిసం తో కూడా మందులు సేసీవోడని సెప్పుకునీవోరు. పెల్లాం పోయిన దుక్కంలో ఆ అయ్య ఊరు కానూరు ఒలసొచ్చీసినాడే కానీ.. మా ఊల్లో అయితే బయం నేకుండా వొయిజ్జం సేయించుకోసరం పైడ్రాజు దొరికినాడని సంబరం పడిపోనారందరూ! గవురికి తండ్రి వొయిజ్జం మప్పినాడు. కలవంలో మందు నూరీటిది. అయ్య సేసిచ్చిన మందు పొటలాలు కట్టీది. నూని వొస్త్ర గాలితం సేసీది. యే రోగానికి యే మందో టక్కున సెప్పీసీది. వొయసు సిన్నదే కానీ గుంట మా సురుకు.
నాకు మేనబావతోటే పదకొండేల్లకే మనువు సేస్సినారు గందా! మా బావ ఇల్లరికవూఁ, ముగుడుపోయిన మా బాప్ప అరణవూఁ ను. ఇట్టా యేల్లు గడిసి.. నానూ, గవురీ యేడాది తేడాలో సవఁర్తాడావు. యేటొడ్డు రెల్లుదుబ్బు నాగా మిసమిసనాడిపోయేటోల్లం. మాయమ్మ సేరు కుంకుడు కాయిలతో మా యిద్దరికీ తలంటీది. నాగుపావుఁల్లా జడలు! "నచ్చివీఁ దేవీ!" "గైరమ్మ తల్లీ!" అని పిలిసుకుని మురిసిపోయేటోల్లు మా అయ్య, సిన్నాన్నాను. గవురికి సవర్తాడక మునుపు మనువు సెయనేదు. "కులపోల్లంతా యెలేసినా పదారు దాటని పిల్లకి పెల్లి సెయ్య"ననీసినాడు మా సిన్నాన్న. సెప్పి సెప్పి సాలొచ్చి వొల్లకున్నాడు మాయయ్య. గవురికి ఆ పదారూ రానే వొచ్చీసినాయి.. ఎల్లిపోనాయీ. నాకేమో తొలిసూలు ఆడపిల్ల పుట్టి పురుట్లోనే పోనాది.
"కలిసొచ్చిన దాయికి ఇంటెనకే మనువని" నన్ను యెకసెక్కాలాడేటోల్లా.. నాకేవోఁ గవురిని సూత్తే మా ఈసుగా ఉండేటిది. 'మూగమనుసులు' సినీమాలో జెవుఁన నాగా యేటమ్మటా, పుట్టలమ్మటా గవురి తిరిగినట్టూ నన్ను తిరగనిచ్చీవోరు కాదు. "మనువైన గుంటవి, కుదురుగా యింటికాడ వొంట సేయ"మనీవోరు. మాయమ్మే గయ్యాలి గంప! మాతకి మునుపు "నువ్వు పెద్దదాయివి.. అది సిన్నగుంట.." అనీది. అయితే ఏవీఁ.. గవురీ, నానూ యింటెనక దడి దూకీసి, గట్లమ్మట యేటొడ్డుకి పారెల్లి ఆటలాడీసీవోల్లం.
ఓనాడు నెల్లిమరల ఆకుల సింతయ్య, సెయ్యి యిరిగి నాలుగు మాసాలవినా సాగట్నేదని మా సిన్నాన్న దగ్గిరికి సూయించుకోనీకి కొడుకునెమ్మట తీసీసుకుని వొచ్చీనాడు.. ఆల్లబ్బాయి పేరు మల్లేశు. చెయ్యెత్తు మడిసి. ఎర్రగా.. సిమ్మాసెలం కొండ దారిన ఔపడే 'కోతి' నాగా ఉన్నాడని నానన్నాను. "ఎల్లొసే.. కల్లు పోనాయేటి! సీంబాదం సెట్టు నాగా ఉన్నాడ"ని గవురన్నాది.
మల్లా మాసం.. మందు నూని ఒట్టుకెల్దామని వొచ్చీనాడు మల్లేశు. సూరు కిందకి దూరి ఒచ్చేతప్పుడు మట్టినలుసు కంటో పడిపోనాది. "స్సూ.." అని కన్ను కెలికీసుకుంతూ లోనకొలిపొచ్చి, అంత మడిసీ గిలగిల్లాడిపోనాడు. నానేమో ఇంటి ముంగిల్లో కూకుని సేప రుద్దుతన్నాను. గవురిని పిలిసాను. నాలిక్కొనతో మల్లేశు కంట్లో నలుసు తీసీసినాది. మందు నూనొట్టుకుని యెల్లిపోనాడు. ఆడి కంట్లో నలుసు పోనాది కానీ గవురి పడ్డాది. నాకెట్టా తెలుసా..? యెల్లిన మూడో నాడు "నూని కాయ సెయి జారి బద్దలేసిపోనాదని" మల్లా వొచ్చినాడు మల్లేశు.
మల్లేశు రెండ్రోజులకోపాలి ఔపడగానే, సిలకపచ్చ పవిఁట కాత్తా రెక్కలయిపోయి, ఎగిరి ఏటొడ్డున వోలీది గవురి! 'వొయిసులో ఉన్నారులే' అని ఒగ్గీనేను.. దాని మనుసు కట్టపెట్టనేను. మా ఇరకాటంలో పడిపోనాను. తాటి తాండ్రి, ముంజికాయలు, చెగోనీలు, యేపిన చెనక్కాయలు, జొన్నపొత్తులు.. యేటో ఒకటి తీసుకెల్లి ఆడికి తినిపించీది. ఆడు తినీవోడు. "సైకిలేసుకు యేటొడ్డుకు నీ కోసరం ఒలిపీరావడమే నీకు మహాబాగ్గెవోఁ గవురీ.. నాకు సేవలు సేసుకోయే!" అన్నట్టు ఒచ్చీవోడు. ఎండలో మాడి ఈ గుంట లగెత్తుకుని పోయ్యీది. ఒక్కపాలి సైకిలెక్కించుకు సంగోరు దూరం అయినా దింపీవోడు కాదు. ఒక్కనాడూ మురిపేనికైనా ఓ పువ్వో, పండో దాని సేతిలో పెట్టీవోడు కాదు. వోన పడితే అది తడిసి, ఆడి తల చెంగుతో కప్పీది. ఆడికోసవే బతికీది. ఆడూ వొచ్చీవోడు.. సైకిలున్నరోజు, బుద్ది తిరిగిన రోజు, నేదా.. గవురి కబురెట్టిన రోజూ..
ఓనాడు గవురికి మా సెడ్డ ఊష్టవొలిపొచ్చీసినాది. ముందరి మజ్జాన్నమే మా సిన్నాన్న బదరాసెలం ఎల్లాడు. పది రోజులక్కానీ రాడు. తోసిన వైద్దెం సేసుకుని అదీ, బెంగెట్టుకు సూత్తా మావూఁ.. మొత్తానికి వారానికి నెగిసి తిరిగినాది.
"మల్లేశు యేటొడ్డుకొచ్చీనాడేమోనే.." అనడిగినాది.
"నీకు జొరమొలిపొచ్చిందని ఆడికి కల్లోకెల్లి సెప్పుకోనేకపోనావా? ఆడు నీ కల్లో కూడా అప్పనంగా రాడు గందా!" అన్నాను.
"ఎల్లొసే.. ఆడు అబ్బరంగా పెరిగిన బిడ్డ. సేయించుకోడం అలవోటు. నాను సేత్తే యేటి నట్టం? రేప్పొద్దున్న ఆడు పెట్టిన తిండి తినీ దాయిని. ఆడు తెచ్చిన కోక కట్టిందాయినీ.." కలల్లో తేలతా సెప్పింది.
మర్నాడు నూకరాజనే గుంతడితో కబురంపిత్తే.. యేటొడ్డుకొచ్చాడు మల్లేశు. ఏటయినాదో ఏటో.. మొకం మాడుసుకొని యెనక్కొచ్చినాది గవురి. ఏటయినాదే.. అంటే "నా మొకం సూసైనా "యేటే అలా ఉన్నావని" అడగనేదే! జొరమొచ్చిందంతే "ఊ.." అన్నాడంతే." అని బిక్కమొకమేసింది. "రేపొత్తాడు గందా.. అప్పుడడిగీ మొద్దు మొకం నాయాల్ని. "ఏరా.. వారం రోజులు పేఁవించిన దాయి ఔపించకపోతే యేటయిపోనాదని బెంగ నేదేట్రా?" అని.. అరిసాను. మాయమ్మ ఒలిపొస్తోందని నా డొక్కలో మోసేత్తో పొడిసి "ఇస్సూ.." అని యెచ్చరించింది గవురి. "దీని కరమ" అని తిట్టుకున్నాను. నిండు సూలాల్ని కాకపోతే అప్పటికప్పుడు ఆడింటికి లగెత్తి ఆడి మొకం ఈడ్సీసీ దాయినే!
నాల్రోజులకి నాకు నెప్పులొచ్చినాయి. పేణాలు సిమ్మాద్రప్పన్న కొండెక్కి.. నా ముగుడి అదురుట్టం బాగుండి యెనక్కొచ్చాయి. మాయమ్మ కడుపు సలవన నాను గండం గట్టెక్కి, నా కడుపు సీల్సుకుని ఓ నలుసు.. ఈడే ఈ సిమ్మాసెలం గాడు.. పనసపండు నాగా బూమ్మీద పడ్డాడు. కల్లల్లో పేణాలు యెట్టుకుని నీర్సంగా నులకమంచం మీద పడున్నానా.. నా సెయ్యి అప్పటిదాకా పక్కనున్న గవురి సేతిని నులివిఁ పిప్పి పిప్పి సేసీసినాదని అప్పుడు సూసాను. "కన్నెపిల్ల ఎంత బయం పడిపోనాదో..!" అని గచ్చుమన్నాను. మాయమ్మకి సాయం మరో ఆడతోడు గవురే అయినాదా ముసురు రేతిరి.
సిమ్మాసెలానికి మూడోనెలొలిపొచ్చినాక మొక్కు తీర్సుకోనీకి అప్పన్న కొండకెల్లామా.. ఆ రోజు కొండమీన కోతిని సూసి మల్లేశు గురుతొచ్చీ.. "ఈమజ్జె ఆడు ఔపడ్డం నేదేటే?" అనడిగితే, "యేటీ నేదు. కత కంచికి.. మనమింటికీ" అన్నాది గవురి. "యేటయినాదే.. ఎర్రి మొకమా! పేణాలు పెట్టుకున్నావాడి మీన?" అని దాన్ని దగ్గిరసా పొదూకున్నాను. గొల్లుమంతాదనీసుకున్నాను. ఆడేదో అన్నేయం సేసాడనుకున్నాను. అదేటీ కాదు.
"ఈ సిమ్మాసెలం గాడు పుట్టిన సెణం నీ బాద సూసేను గందా.. సచ్చి పుట్టావే మాయమ్మా! సల్లని అప్పన్న సూసి ఆడూ నువ్వూ పదికాలాలు సుకంగుండాల! ఒకడి బిడ్డని మోసి కనేతపుడు అంత యేదన పడాలంటే ఆ మడిసి ఎంత ఇలువైనవోడు అయి ఉండాలో గందా అప్పా?" మాటలాపేసి ఎటో సూపు సారించినాది గవురి. దాని యీపు సరిచాను.
"ఎహే.. ఆడు ఉత్త ఎదవా.." అన్నాను. వొలిసె పువ్వులా నవ్వీసినాది గవురి. "ఆడు సెడ్డోడు కాదులే! నాకు తగినోడు కాదంతే. ఆడికి పేఁవ ఉంది.. అది నాకు సరిపోదొలే." దాని మొకమంతా నెప్పి. మనుసు ముక్కలైన నెప్పి. మొకం మీది పుట్టుమచ్చ దాసీయొచ్చేవోఁ గానీ మనసిరిగిన బాదని దాయడం సులబం కాదు.
"నీకు తగ్గోడు ఒత్తాడే.. కల్లల్లో ఎట్టుకు సూసుకుంతాడు." కాలగ్గేనం సెప్పినాను. "ఏవోఁ అప్పా.. ఎవుడొత్తాడో. మనుసుపడిన మనువు అవనేదని బాద నేదు. మనువు సేసుకున్నాక మనసెట్టి కాపరం సేత్తాననీ నమ్మకవూఁ నేదు." గవురి యేదాంతం సెప్పినాది. "మనసెట్టి కాపరం సెయ్యకపోతే ఏటి సేత్తావే! ఆ మల్లేశు గాడిని తలుసుకుంటా ఏడుత్తావా..? ఎర్రి మాతలు ఆడినావంతే కాల్లిరిసి పొయినో యెడతా. ఒల్లకుండి తప్పు సేసాను ఇందాకా." యెర్రి కోపమొలిపొచ్చినాది నాకు.
"నేదప్పా.. ఆడిని కాదనుకోడానికి కారనవేఁ నా సుకం. ఏరికోరి సేసుకున్నాక ఆడి తీరు నచ్చక రోజూ నా సేతని నేను తిట్టుకుంటా బతకనేను. ఆడిదీ తప్పని నాను అనను. ఆడిని పెంచిన పెంపకమట్టాంటిది. అత్తమానవూఁ "నాకాయుస్సూ నాకారోగ్గెం.." అనీ సిలక ముద్దుతనం ఆడిది. పంచుకుని తినాలనే బుద్ది ఆడి అమ్మే మప్పాలి గందా! అవుసరమవితే గుండికాయ తీసీసి ఆడి కాల్లకాడ యెడతా. ఆడూ అట్టాగే ఉండాలని కోరుకోటం తప్పేం కాదుగా! ఆడు అట్టా సెయ్యడని తెలిసీ సేసుకోడం నాదే తప్పవుతాది. నాకంత పేఁవ నేదు. అదే మాయయ్య తెచ్చినోడు ఎట్టాంటోడైనా నా రాతనుకుని సరిదేసుకుంతాను. ఏటంతావప్పా.. సరిగానే సేసానా?" యెందుకో ఆరేల్ల మజ్జి గవురి గురుతొచ్చింది నాకా చెణంలో! కొన్నింటికి మనవు సమాదానం సెప్పక్కర్నేదు. ఆనక గవురి కత యేటయినాదో తవఁరికీ అక్కర్నేదు.
నిన్న రేతిరి కాడినుంచీ ముసురట్టి కొంప కారి సత్తా ఉంటే, నిండు సూలాల్ని.. సాయిత్తిరిని, కల్లు పువ్వుల్లేసి ఔపించని నా కాడ ఒగ్గీసి.. నా కొడుకు సిమ్మాసెలంగాడు ఆడు పనిసేత్తన్న బేంకీలో ముసుగెట్టి తొంగున్నాడయ్యా.. రేతిరి బయలుదేరతా ఉంటే వోన మొదలయినాదట. తడిసి మొక్క మొలిసిపోతాడా..? ఆడి బిడ్డని మోత్తున్న ఆడదాయికి రేత్తిరేళ ఏ అవుసరం ఒత్తాదో అన్న ఇంగితముండక్కర్నేదా..? సేయించుకునే వొంటిని సేయడానికీ వొంచాల! బజార్లో ఉదయం టిపినీ తినీసి మరీ ఇంటికొచ్చినాడు. నాకు ఒల్లు మండిపోనాదంటే మండదా మరీ? ఆ యెర్రి సాయిత్తిరి టీనీల్లు కాత్తోందయ్యా ముగుడొచ్చేడనీ.. ఇది ఒక్క నాటికి పొయ్యేది కాదు బావూఁ.. సివరాకరి దాకా సరిసమానంగా ఇచ్చి పుచ్చుకునే యేపారవేఁ మనువంటే! ఎవురూ నట్టపోకూడదు.
"ఇంత సిన్న ఇసయాన్ని కొండంత సేసావే అప్పల్నరసా.." అంతారేవోఁ.. బావూఁ.. "తోటకూరనాడే సెప్పనైతిని కొడకా..!" అని నాను ఏడవనేను.
ఓలమ్మో ఆకాయిగోరూ ఏటిదిదీ ఇలగ రాసీనారూ! ఏటిదో కద సెప్తన్నారు గందా అని సదివితే సివరాకరికి ఎల్తప్పుటికి మనుసు బలువెక్కించీనారు. ఇజినారం బాస మట్టీకి సెప్పనానికి నేదింక. బలేగ రాసీనారు.
ReplyDelete:) ధన్యవాదాలండీ!
Delete@@"ఆడుసెడ్డోడు కాదులే! నాకు తగినోడు కాదంతే. ఆడికి పేఁవ ఉంది.. అది నాకు సరిపోదు."
ReplyDeleteఇంకా చాలానే ఉన్నాయి చెప్పాలంటే నచ్చినవి. కధ గురించి చెప్పగలిగే శక్తి నాకొచ్చిన భాషకి లేదు. అలాగే కొన్ని చెప్పకుండా అనుభవిన్చడంలోనే ఎక్కువ ఆనందం.
వావ్. భాష ఎక్కడన్నా తప్పుద్దేమో అని, భూతద్దం పెట్టుకునీ మరీ వెదికేను. వూహూ...
రాసిన దగ్గరనుండీ భూతద్దం పెట్టుకుని దిద్దుతూనే ఉన్నానండీ. ఇంకా ఒకటో అరో పలుకురాళ్ళు తగులుతూనే ఉన్నాయి. :) ధన్యవాదాలు!
Deleteమా బాగా సెప్పారు మనువు గురించి .. చాలా బాగా రాసారండి..
ReplyDeleteయెన్నాలయిందో ఈ మాండలికం విని.. :-)
అలవాటు లేని మాండలికంలోని కధ చదివేప్పుడు రెండు మూడు పేరాలయ్యాక ఎందుకో ఉత్సాహం రవ్వంత తగ్గుతుంది (నాకైతే)... అంటే గబగబా చదవడానికి కుదరని చిన్న అసహనం వల్ల మాత్రమే!! కానీ ఇది చదువుతుంటే మాత్రం ఎక్కడా ఆపబుద్ది కాలేదు.. నిజం చెప్పాలంటే, ఇంత చిక్కని విజయనగరం/శ్రీకాకుళం (pardon me if I'm wrong) మాండలీక కధ చదవడం నాకు మొదటిసారి!
ReplyDeleteకధా వస్తువు కంటే, కధనం చాలా చాలా ఇంకా చాలాలు కలుపుకుని నచ్చేసింది :-)
ఈ పేరా అయితే సింపుల్ గా, A..M..A..Z..I..N..G!!!!!
"ఎహే.. ఆడు ఉత్త ఎదవా.." అన్నాను. వొలిసె పువ్వులా నవ్వీసినాది గవురి. "ఆడు సెడ్డోడు కాదులే! నాకు తగినోడు కాదంతే. ఆడికి పేఁవ ఉంది.. అది నాకు సరిపోదు." దాని మొకమంతా నొప్పి. మనుసు ముక్కలైన నొప్పి. మొకం మీది పుట్టుమచ్చ దాసీయొచ్చేవోఁ గానీ మనసిరిగిన బాదని దాయడం సులబం కాదు.
ఉత్తరాంధ్ర (విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) మాండలీకంలోనే రాయడానికి ప్రయత్నించాను. రాయడం నాకూ మొదటిసారే. మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహానికి చాలా సంతోషంగా ఉందండీ. :) ధన్యవాదాలు!
Deleteచాలా బావుందండీ! :)
ReplyDeleteధన్యవాదాలు!
Deletewow...superb.
ReplyDeleteloved every bit of it... ur narration was sooo sensible.
ధన్యవాదాలు!
Deleteకధ, కధనం చాలా బావున్నాయి. విశాఖ మాండలీకం లో రాసి మీ రచన కొత్త కోణం చూపారు
ReplyDeleteధన్యవాదాలు!
Deleteఇలా ఇబ్బంది పెట్టేస్తే ఎలాగండీ... మాండలీకంలో కథ చదవడానికి మూడు నాలుగు పేరాలదాకా కూడుకుని కూడుకుని చదువుకుని కాస్త ఇబ్బంది పడితే.. పూర్తిగా చదివాక మీకథకి ధీటైన కామెంట్ రాయలేక.. ఏమీ చెప్పకుండా ఉండలేక ఎంత ఇబ్బంది పడుతున్నానో ఇందాకటినుండి... కొన్ని ఇబ్బందులు ఇష్టంగానే ఉంటాయనుకోండి :-)
ReplyDeleteకథ చాలా నచ్చేసింది, కథావస్తువు మాండలీకం ప్రజంటేషన్ అన్నీ అద్భుతం.. ఈ క్రింది వాక్యం నాకు చాలానచ్చేసింది ఎంత కరెక్ట్ గా చెప్పారో.. గవురి పాత్ర కూడా భలే నచ్చేసింది..
“మొకం మీది పుట్టుమచ్చ దాసీయొచ్చేవోఁ గానీ మనసిరిగిన బాదని దాయడం సులబం కాదు.”
శ్రమ తీసుకుని మరీ చదివి, అభిప్రాయం చెప్పిన మీ ఆదరానికి ధన్యవాదాలు! :)
Delete"ఒకడి బిడ్డని మోసి కనేతపుడు అంత యేదన పడాలంటే ఆ మడిసి ఎంత ఇలువైనవోడు అయి ఉండాలో గందా అప్పా"
ReplyDeleteఈ లైన్ తరువాత చాలా సేపు ముందుకి వెళ్ళలేక పోయాను. విలువైన మాట చెప్పారు. చాలా చాలా బావుంది కథ.
-లక్ష్మి
మా౦డలీకంలో చాలా చక్కగా వ్రాశారు. ఆ భాష తెలియకపోయినా చదవడానికి ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. దాచుకుని చదువుకోవలసిన కథ... ఎన్నటికీ గుర్తుండిపోయే కథ.
ReplyDeleteచాలా సంతోషమండీ! ధన్యవాదాలు!
Deleteవ్హావ్...కధ,కధనం సూపర్. congrats
ReplyDeleteధన్యవాదాలు!
Deleteబావుంది. యాస తెలిసిన వాళ్ల చేత చదివించి ఆడియో పెట్టండి.
ReplyDeleteమంచి సలహా ఇచ్చారండీ! తప్పకుండా వెతుకుతాను.. అప్పలనరసని. ధన్యవాదాలు!
Deleteబావుంది. యాస తెలిసిన వాళ్ల చేత చదివించి ఆడియో పెట్టండి.
ReplyDeleteకూడబలుక్కొని రెండు రోజులు చదివాను.....
ReplyDeleteపైన నిషి గారు చెప్పిన పారా ,చివరి conclusion అండ్ కొన్ని మాటలు బాగా నచ్చాయి.
రాస్తూ ఉండండి :))
అలవాటు లేని మాండలీకాన్ని సైతం అర్ధం చేసుకోవాలని శ్రమ పడినందుకు ధన్యవాదాలండీ! :)
Deleteనిషి కామెంటే నాదీనూ! అలవాటు లేని మాండలికం చదవడానికి రవ్వంత ఇబ్బంది పడినా,ఇంతకీ గౌరి మనసు పడినోడు ఏం చేసుంటాడో అనే ఆత్రుతతో అక్షరాల వెంట పరిగెట్టా!
ReplyDeleteఒకడి బిడ్డని మోసి కనేతపుడు అంత యేదన పడాలంటే ఆ మడిసి ఎంత ఇలువైనవోడు అయి ఉండాలో గందా అప్పా?" ఈ లైన్లు నాకు చాలా నచ్చాయి.
హాయిగా ఉంది కథ!
మాండలీకం తప్ప ఈ కథ చెప్పేందుకు వేరే దారి కనిపించలేదండీ. మీ శ్రమకు ధన్యవాదాలు!
Deleteఅద్భుతం గా రాసేరండీ..
ReplyDeleteఏం నచ్చిందీ? అంటే ఇదీ అని చెప్పలేను.
కొన్ని లైన్స్ తెచ్చి ఇవి బాగున్నాయి అని చెప్తే మిగిలిన మాటల్ని తక్కువ చేసినట్టే అనిపిస్తుంది నాకు.
టోటల్గా సూపర్ అంతే.
మీరు చదువుతూ ప్రోత్సహిస్తున్నారు. మీకూ సూపర్ థాంక్స్! :)
Delete<>
ReplyDeleteఇదొక్క మాట చాలండీ వైవాహిక బంధం అంటే ఏమిటో చెప్పడానికి.
"సివరాకరి దాకా సరిసమానంగా ఇచ్చి పుచ్చుకునే యేపారవేఁ మనువంటే! ఎవురూ నట్టపోకూడదు."
Deleteమీకు నచ్చిన ఈ వాక్యమే కథకి మూలం కదండీ. ధన్యవాదాలు!
అక్కడక్కడా మాండలికం కాస్త ఇబ్బంది పెట్టినా (ఇది మీ తప్పు కాదందోయ్..మాదే!) కథనం చాలా బాగుంది.
ReplyDeleteఒకడి బిడ్డని మోసి కనేతపుడు అంత యేదన పడాలంటే ఆ మడిసి ఎంత ఇలువైనవోడు అయి ఉండాలో గందా అప్పా?...ఇక్కడ మాటల్లేవు!
"ఎహే.. ఆడు ఉత్త ఎదవా.." అన్నాను. వొలిసె పువ్వులా నవ్వీసినాది గవురి. "ఆడు సెడ్డోడు కాదులే! నాకు తగినోడు కాదంతే. ఆడికి పేఁవ ఉంది.. అది నాకు సరిపోదు." దాని మొకమంతా నొప్పి. మనుసు ముక్కలైన నొప్పి. మొకం మీది పుట్టుమచ్చ దాసీయొచ్చేవోఁ గానీ మనసిరిగిన బాదని దాయడం సులబం కాదు...ఈ పేరా గురించి ఏం చెప్పినా తక్కువే!(అసలు చెప్పటానికి మీలా మాకు మాటలు వస్తేగా..పదాల అల్లిక తెలిస్తేగా).
’మా పెద బాప్పకి యీరకత్తెకి సెల్లెలు ఉండీటిది"..ఇంతకీ బాప్ప అంటే అత్త కదా! యీరకత్తె..అంటే??అది పేరా? లేక మీ మాండలికంలో మరో బంధుత్వమా! ఒకవేళ అది పేరయితే అత్త చెల్లెలు చెల్లెలేగా..అంతే అత్త మొగుడు అంటే పైడ్రాజు..మామయ్య కదా..కథలో చిన్నాన్న అని వచ్చింది....నేను అర్థం చేసుకోవటం తప్పయితే మన్నించెయ్యండి!
యీరకత్తె అంటే వియ్యపురాలండీ. (యీరకాడు = వియ్యంకుడు) అత్త వియ్యపురాలి చెల్లెలు = పిన్ని.
Deleteమన్నింపులెందుకండీ. ఆ పదం మిస్ లీడ్ చేసింది మిమ్మల్ని. అంతే. ధన్యవాదాలండీ! :)
చాలా బాగుంది
ReplyDeleteధన్యవాదాలు!
DeleteAwesome!
ReplyDelete"ఒకడి బిడ్డని మోసి కనేతపుడు అంత యేదన పడాలంటే ఆ మడిసి ఎంత ఇలువైనవోడు అయి ఉండాలో గందా అప్పా"
kadaa...
kani ippati taram lo.. pillalu jeevitam lo maro dasa laaga, mana kosam kantunnattu ga ne undi..
asalu arranged marraiges lo enni sarlu manaki aa manushulu antha viluvaina vallu ga anipistaru?
ippati daaka prema ante valla nundi emi expect cheyakunda manam ivvadame ani vinnanu... correct anipinchaledu..
ippudu prema ante manaki manam value ichhi korukodam kooda ani vinnanu :) correct ye anipistundi.. kani appudu aa prema ichhi puchhukune swartham kaada??
asalu premante... vallani baga choosukodamena? inkem kada?
or premante / manchi ante niswartham niswartham ani vini vini, andulo swartham undalane vishyanni oppukodaniki manasu oppukotam ledaa??
మీ ప్రశ్నల్లోనే సమాధానాలున్నాయండీ. :)
Deleteకొంతమందికి ఇచ్చి పుచ్చుకోవడం తప్పనిపించదు. ఇంకొందరు ఇవ్వడం తప్ప తీసుకోవడం తప్పని భావిస్తారు. ప్రతివ్యక్తి వేలిముద్రా వేరుగా ఉన్నట్టే, ప్రతి వ్యక్తి దృష్టిలోనూ ప్రేమ నిర్వచనం వేరు కదండీ! ఎవరి పరిస్థితులను బట్టి, అనుభవాలను బట్టి వారు నిర్వచించుకోవలసిందే. ఇక్కడి కథలో ఇచ్చి పుచ్చుకోవడమే సబబని గవురి, ఆమెను చూడబట్టి అప్పల్నరస అనుకున్నారు. అంతే.
మీ స్పందనకు ధన్యవాదాలు!
కోవాగారూ,
ReplyDeleteనిజంగా ఈ కధ ఒక యాసలో చెప్పటం వల్లే కధకి లైఫ్ వచ్చింది అనిపించింది. ఇవే మాటలు సాదారణ భాషలో, నగర నేపధ్యంలో చెప్పుంటే చాలా మూస కధల్లో ఒకటయిపోయేదేమో. మీరు ఆ యాసలో ఎత్తుకోవటంలోనే సగం గెలిచేసారు. ఆలోచించి అర్ధం చేసుకునే మనసుంటే ఆడవాళ్ళే ఆడవాళ్ళకు శత్రువు అనే మాటను చెరిపోయెచ్చని చాలా అందంగా చూపించారు.
"సిలకపచ్చ పవిఁట కాత్తా రెక్కలయిపోయి, ఎగిరి ఏటొడ్డున వోలీది గవురి!"
"మొకం మీది పుట్టుమచ్చ దాసీయొచ్చేవోఁ గానీ మనసిరిగిన బాదని దాయడం సులబం కాదు."
"ఒకడి బిడ్డని మోసి కనేతపుడు అంత యేదన పడాలంటే ఆ మడిసి ఎంత ఇలువైనవోడు అయి ఉండాలో గందా అప్పా"
ఈ మాటలు అద్భుతంగా ఉన్నాయి. పుస్తకాల్ని కాక జీవితాన్ని, ప్రకృతిని చదువుకున్న మనుషుల మాటల్లో కవిత్వాన్ని అర్ధం చేసుకోగలిగితే అందులో ఒక సొగసుంది.
ఒకమంచి కధ మా అందరికోసం అందించినందుకు ధన్యవాదాలు.
అవునండీ! కథని మామూలుగా చెప్పాలని అనుకోలేనంత ఇమిడిపోయింది మాండలీకం.. ఈ కథలో. ముందు సంభాషణలు మాత్రమే తూర్పు యాసలో రాద్దామని అనుకున్నాను. తృప్తి కలగలేదు. అందుకని అప్పల్నరసకి పగ్గాలిచ్చేసాను. :) మిమ్మల్ని మెప్పించిందన్నమాట. సంతోషం! ధన్యవాదాలు!
Deleteయాస మీద నీకింత పట్టుందని నాకు తెలీనే తెలీదు సుమీ! :)
ReplyDeleteమంచి పాయింటు...చక్కటి కథ. బాగా రాసావు. నచ్చింది. యాస దాదాపుగా పట్టేసావు. ఈ యాసలో రాయడం వలనే కథకి అందం వచ్చింది. అక్కడక్కడా కొన్ని వాక్యాలు భలే మెరిసాయి. అవేంటో పైన అందరూ చెప్పేసారుగా! good going, keep it up!
రాసేవరకూ నాకూ తెలియలేదు. నిన్ను ఆశ్చర్యపరిచానంటే నా ప్రయత్నం విజయవంతమయినట్టే! థాంక్స్! :)
Deleteయాస మీద నీకింత పట్టుందని నాకు తెలీనే తెలీదు సుమీ! :)
ReplyDeleteమంచి పాయింటు...చక్కటి కథ. బాగా రాసావు. నచ్చింది. యాస దాదాపుగా పట్టేసావు. ఈ యాసలో రాయడం వలనే కథకి అందం వచ్చింది. అక్కడక్కడా కొన్ని వాక్యాలు భలే మెరిసాయి. అవేంటో పైన అందరూ చెప్పేసారుగా! good going, keep it up!
మొకం మీది పుట్టుమచ్చ దాసీయొచ్చేవోఁ గానీ మనసిరిగిన బాదని దాయడం సులబం కాదు. - :(
ReplyDeleteనిజమే కదండీ. కొన్ని దాగవు.
Deleteధన్యవాదాలు!
పైన అందరూ చెప్పేశారు.. ఇంకా నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. కథ చాలా చాలా బాగా రాసారండీ.. నాక్కూడా ఈ యాస కొత్త. ఇదే మొదటిసారి వినడం/చదవడం.. కూడబలుక్కుని చదవడానికి కాస్త టైం పట్టింది కానీ మురళీ చెప్పినట్టు ఈ కథకి యాసే ప్రాణం అనిపించింది. :)
ReplyDeleteఈ కథకి యాసే ప్రాణం. మీ అందరి స్పందనే ఊపిరి. శ్రమ తీసుకున్నారు. :) ధన్యవాదాలు.
DeleteWow!superb...n mana iddari madhya gadachina oka valuable experience gurtochindey! Emy untundo cheppuko!
ReplyDeleteఅమ్మడూ, గుర్తొచ్చిందా? దాని విలువ అమూల్యం. :) Thank you!
Deleteపప్పు నాగరాజు గారికి పెద్ద థాంక్స్ చెప్పాలి.. మీ బ్లాగు పరిచయం చేసినందుకు. అద్భుతంగా రాసారు. నాకు మాత్రం బాగా నచ్చింది వానపావు కొట్టు..ఎందుకంటే మాదీ ఇజీనారమే.. :)
ReplyDeleteమీకు నా బ్లాగ్ పరిచయం చేసినందుకు నేనూ నాగరాజు గారికి థాంక్స్ చెప్పాలండీ! ధన్యవాదాలు!
Deleteఅబ్బాబ్బబ్బబ్బ్బా.... ఏమి యాస అండి! :) ఈ మధ్యనే సీకోలం యాస వింటాం ఎక్కువైంది ... నాకు ఈ యాస కొత్త ...చదవటానికి ఇబ్బంది పడిన మాట వాస్తవం... కానీ ఆ శ్రమకి వెయ్యిరెట్ల ఆనందం అనుభవించాను మీ కథలో ! Great narration! :)
ReplyDeleteఇబ్బంది పెట్టినా ఫలితం దక్కించానన్నమాట! సంతోషమండీ. ధన్యవాదాలు.
Deleteఆహా భలే రాసారు.....ఎంత బాగుందో.... మన భాష మీద ఇంత పట్టు మీకుందని ఇప్పుడే తెలిసింది. కథ కూడా చాలా బావుంది. మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. గవురి ఎంత బాగా ఆలోచించిందో కదా. అలా ఆలోచిస్తే ఎంత మంది ఆడపిల్లల జీవితాలు బాగుపడతాయో.
ReplyDeleteగవురిలా భవిష్యత్తుని, పరిస్థితులనీ త్రాసులో తూచడం అంత సులువైన విషయం కాదుకదండీ. అందుకే సందిగ్ధంలోనే పొరపాట్లు జరిగిపోతుంటాయేమో! ధన్యవాదాలండీ!
Deleteబాగా రాశారు.
ReplyDeleteధన్యవాదాలు!
Deleteబాధ్యత కలిగిన తల్లి ఆలోచన.
ReplyDeleteకథ అద్భుతం, కథనం అమొఘం
వెరశి, ఒక అలోచింపచెసే కథ.
ధన్యవాదాలు!
DeleteI am sorry to say, not up to your standard. సింహాచలం కొండ మీద ప్రేమగురించి గౌరి చెప్పే మాటలు, సగటు తెలుగు సినిమాలో మాండలికంలో మాట్లాడే పాత్ర మాటల్లా ఉన్నాయి - మిగతా కథనంలో ఒదగలేదు. ఫ్లేష్ బేక్ గౌరి కథకీ, ప్రస్తుతంలో సింహాచలాన్ని చెంపపెట్టు పీకడానికీ పొంతన కూడా సవ్యంగా లేదు. ఇంకా బాగా రాస్తారని ఆశిస్తాను.
ReplyDeleteతప్పక ప్రయత్నిస్తానండీ! ధన్యవాదాలు!
Deleteబావుంది.
ReplyDeleteమూడు ముత్యాలు ఏరుకున్నాం...:))
"ఒకడి బిడ్డని మోసి కనేతపుడు అంత యేదన పడాలంటే ఆ మడిసి ఎంత ఇలువైనవోడు అయి ఉండాలో గందా అప్పా?"
"మొకం మీది పుట్టుమచ్చ దాసీయొచ్చేవోఁ గానీ మనసిరిగిన బాదని దాయడం సులబం కాదు. "
"సివరాకరి దాకా సరిసమానంగా ఇచ్చి పుచ్చుకునే యేపారవేఁ మనువంటే! ఎవురూ నట్టపోకూడదు."
Just came here through a friend's suggestion.
ReplyDeleteచాలా బాగా రాశారు..యాస విజయనగరానిదైనా, విశాఖపట్నానిదైనా భావం సార్వజనీనమైనది..
ఆడవారి మనసుని ఆరు పేరాల్లోనూ చెప్పొచ్చని తెలియజేశారు..బావుంది..చాలా బావుంది..
వోలమ్మోలమ్మ కొత్తాకోయి గోరు ....ఇలా రాసేసినారేటి తల్లీ...
ReplyDeleteమూగమనుసులు' సినీమాలో జెవుఁనని తలుసుకున్నారు గదా అని సెప్తున్నాను - తవరు సెప్పిన మా గవురి కవుర్లు ఇంటుంటే ఒకపాలి ఈ పాట గుర్తుకొస్సీసినాది.....
పెమిదని తెచ్చీ వొత్తినివేసీ సమురుని పోసీ బెమ సూపేవా
ఇంతా చేసీ యెలిగించేందుకు ఎనక ముందులాడేవా
మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను
మామూలు మడిసిని నేను నీ మడిసిని నేను...
అద్సరే కాన్తల్లీ...అలా అనుకునీసినారేటి...మా గూర్సి? మావేవన్నా అదేదో ఇస్సనాద్ బాబు చినేమాలో ఈరోయిన్లు అనుకున్నారేటి? ఏదో ఇంత సంపాయిచ్చామా, వుడకేసుకున్నామా, తిన్నామా, తొంగున్నామా - మా సేత అంతంత పెద్ద మాటలు సెప్పించీసినారేటి తవరలాగా....పేమా, మనువూ, ఏపారవూ అంతూ?
నిన్నట్నుంసీ ఈ కత ఇన్నాప్పట్నుంసీ ఈ మాట మీ సెవినేద్దామని ఎన్ని మాట్లు ఇటు ఎల్లిపోయోచ్చీసినానో, మళ్ళీ ఏతనుకుంతారో అని ఎనక్కి పారేల్లిపోనానో తవరికి తెలీత్తల్లీ. ఒక మాట సెప్తా ఇనుకోమ్మా....ఆడ పుటక ఎత్తినందుకు ఆ సిమ్మాచలం కోతి నాన్తోడి మీద కుంచెం మనసు పడ్డాది గానీ ఆడు వొల్లకుండిపోయీసరికి "నీకూ బే...నీ తాతకూ బే " అని ఎలిపోచ్చేసినాది. అంతే ...అంతకు మింసి ఇంకేమీ అగనేనేదు.
వుంతావమ్మా మరి. గ్యాపకమెట్టుకోండి.
దండాలు మరి...
అప్పల నరిసి
**నేనూ కొంచెం ప్రయత్నించానండీ ...మీరంత చక్కగా వ్రాస్తే దానికి తగినట్టుగా వ్యాఖ్య పెట్టాలని. పైన అప్పల నరిసి మాటల్లో చెప్పినట్టే ఆవిడ, ఆవిడ గవురి ఏ కాశీనాథుని విశ్వనాథులవారి సినిమాలోనో దీపో, ఆమనో చేసే పాత్రల్లాగా కొంచెం snobbish గా అనిపించారు - తప్పితే అంత ఉదాత్తమైన ఆలోచనలు చేయగలవారు, ఒక వేళ చేసినా మాటల్లో అంత సున్నితం గా చెప్పగలవారు అయి వుంటారు అనిపించలేదు. అలా వారికి అనిపించకూడదు, అనిపించదు - అని కాదు....కానీ ....అంతే మరి :)
~లలిత
మొన్ననే విశాఖపట్నం నుంచి తిరిగి వచ్చాను ఒక వారం రోజుల తరువాత. విశాఖ లో ఈ యాస అంతగా వినిపించలేదు కాని పక్క పల్లెటూళ్ళలో బాగానే విన్నాను. ఈ యాస మీద మీకు ఇంత పట్టు ఉందని అనుకోలేదు. యాస వల్లే కధకి అందం వచ్చింది.
ReplyDelete>>> సివరాకరి దాకా సరిసమానంగా ఇచ్చి పుచ్చుకునే యేపారవేఁ మనువంటే!
ఈ ఇతివృత్తం పై చాలా కధలే వచ్చాయి. మీరు కద చెప్పిన విధానం బాగా నచ్చింది. అనేక మంది చెప్పిన కధ ని మళ్ళి చెప్పాలంటే కొంత నాటకీయత అవసరం. మోతాదు మించకుండా తగు మాత్రం చూపించారు. అది కూడా బాగుందనిపించింది. మొత్తం మీద చాలా బాగుంది కధ.మీరు వ్రాస్తే మరోలా ఎలా ఉంటుంది...... దహా.
ఇలాంటివి మరిన్ని వ్రాస్తారని ఆశిస్తున్నాను.
నాకు యాస సమస్యగా అనిపించలేదండీ.. (పతంజలి, రావిశాస్త్రి తదితరులకు కృతజ్ఞతలు)
ReplyDeleteకథ చాలా నచ్చింది.. మజ్జి గవిరి పాత్రంటే మీకు చాలా ఇష్టమని అనిపించింది :-)
బావుందండి..
ReplyDeleteఈ యాస మూలంగా మా స్నేహితులిద్దరికి చిన్న గొడవే జరిగింది.
ఆంధ్రా విశ్వకళా పరిషత్లో చేరిన తొలిరోజులు. హాస్టల్లో పిచ్చా పాటి మాట్లాడుకుంటుండగా, బొబ్బిలి నివాసి అయిన మా స్నేహితుడు ఖంగారుగా వచ్చి, "ఒరేయ్ మా ఫ్రెండ్ని లారి మట్టేసిందిరా.." అన్నాడు.
"మట్టేస్తుంటే అక్కడ నిలబడక పొతే పక్కకు వెళ్ళచ్చు కదరా" అన్నాడు తణుకు నుండి వచ్చిన ఇంకో స్నేహితుడు.
మట్టేయ్యడం అంటే 'ఢీ-కొట్టడం' అని అప్పటికి మాకు తెలియకపోవడం వల్ల వచ్చిన తిప్పలు అవి.
Awsome :)
ReplyDeleteఅప్పుడెప్పుడో మన కిట్టీ గాల్స్‌లో జరిగిన ఒక సరదా సంభాషణ జ్ఞప్తికొచ్చిందండీ..! మీ కథలో భావం నాకు భలే బాగా నచ్చింది. అది చెప్పించిన తీరూ నచ్చింది.
ReplyDeleteవిడిగా చూస్తే మాండలీకం ఎంతో కొత్తగా, ఆహ్లాదంగా - మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేంత బాగుంది. కానీ ఎందుకో ఈ కథకి - మీరు చెప్ప్పాలనుకున్న మాటలకి, మాములు భాష అయితే ఇంకా బాగుండేదనిపించింది. బహుశా, ఆ పల్లె పాత్రలు అంతంత లోతు విశ్లేషణలు- వాటిని చర్చించడాలూ మింగుడుపడని కారణం వల్లేమో..
ఇంకో చిరు సందేహం - అజ్ఞానమే అయితే మన్నించేయండి!
ReplyDelete"తోటకూరే నాడే సెప్పేసినను కొడకా" అన్నారు కదా..ఆ కథ ప్రకారం, చిన్ననాటి నుండే కొడుకుకి మంచి లక్షణాలు నేర్పించేయాలి కదా! పంచుకు తినే గుణాన్ని, ఆసరా ఇవ్వగల అభిమానాన్ని - (భార్యకు మాత్రమే కాదు, ఏ వ్యక్తికైనా) పసితనం నుండే అలవరచినట్టైతే శీర్షిక ఇంకా బాగా నప్పేదేమో అనిపించింది.
అలా కాని పక్షంలో "సెప్పనైతిని" అన్నదే బాగుండేదేమో కదా..! మీరు మార్చారు కాబట్టి తప్పకుండా ఏదో చక్కని ఆలోచన మీకు స్ఫురించే ఉంటుంది. అది పంచుకుంటారేమో నని మరో ఆశ.
chala bagundi aithe maa chandram ku ela chupinchadam intlo computer lede
ReplyDeleteadhbhutam!!
ReplyDelete